నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రొటీన్ కథే అయినా.. బాలయ్యను సరికొత్త గెటప్‌లో కనిపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్ అదిరిపోవడంతో ‘అఖండ’బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల చేసినట్లు తెలుస్తోంది.
చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో సూపర్ హిట్ పడడంతో నందమూరీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అఖండ’ మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ స్ట్రీమింగ్ కానుందట. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.