జయ కృష్ణా…ముకుందా…మురారీ…“ఎన్టీఆర్” లుక్

Balakrishna As NTR In NTR Biopic look

అప్పటిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో ఒక పాట పల్లవిలో నాటి రాముడి రూపం మాకు మాత్రమే సొంతం అంటూ సాగుతుంది. అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడి వేషధారణలో నందమూరి హీరోలు అరుదైన రికార్డును నెలకొల్పారు. నందమూరి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఈ ముగ్గురు కథానాయకులు శ్రీకృష్ణుడి వేషధారణతో ఆడియన్స్‌ను మెప్పించడం విశేషం. తెలుగు ఆడియన్స్‌కు శ్రీకృష్ణుడు అంటే ముందుగా గుర్తొచ్చే రూపం రామారావుదే. ఆ తరువాత ఎంతో మంది ఆ పాత్రను పోషించిన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీకృష్ణుడంటే తెలుగు ప్రజలకు తారకరాముడే గుర్తుకువస్తాడు.

ntr-biopic

ఒకానొకప్పుడు తిరుపతి వెళ్ళిన యాత్రికులు మద్రాస్ వెళ్లి అన్నగారిని దర్శించుకుని మరీ వెనక్కి వచ్చే వారంటే ఆయన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఆయన సినీ ప్రస్థానంలో పద్దెనిమిది సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. అంతలా ఆయనకూ కృష్ణుడికీ ఏదో అవినాభావ సంబంధం ఉందనే చాలా మంది భావన. అందుకే కామోసు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా “ఎన్టీఆర్” చిత్రబృందం ఒక ఫోటోను విడుదల చేసి ప్రేక్షకులకు శుభాభినందనలు తెలియజేసింది. “కృష్ణా… ముకుందా… మురారీ…” అంటూ విడుదల చేసిన ఈ ఫొటోలో కృష్ణావతారంలో ఉన్న నందమూరి హీరోలు ఉన్నారు. ఆ లుక్ మీరు కూడా చూసెయ్యండి మరి.

ntr-movie