నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌పై అనుమానాలు…!

Nutan Naidu Eliminated From Bigg Boss House

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2పై మొదటి నుండి విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా బిగ్‌బాస్‌ నుండి నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అవ్వడంపై పలువురు పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఎలిమినేట్‌ అయిన వారిలో నూతన్‌ నాయుడు మంచి ఓట్లు పడ్డాయని, కౌశల్‌ తర్వాత స్థానంలో నూతన్‌ నాయుడు ఉన్నాడు అంటూ స్టార్‌ మా వర్గా ద్వారా వార్తలు వచ్చాయి. కాని నూతన్‌ నాయుడు కంటే సామ్రాట్‌ మరియు అమిత్‌లకు ఎక్కువ వార్తలు వచ్చాయని బిగ్‌బాస్‌ వర్గాల వారు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. బిగ్‌బాస్‌ నుండి ఆదివారం నాడు ఎపిసోడ్‌లో గణేష్‌తో పాటు అమిత్‌ ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు.

madhavi-bigboss2

బిగ్‌బాస్‌లో నూతన్‌ నాయుడు రెండు సార్లు బయటకు వెళ్లి వచ్చాడు. ఆ కారణంగానే ఆయన్ను ఈ వారం ఇంట్లోంచి బయటకు పంపించేసినట్లుగా అనిపిస్తుంది. ఓట్లతో సంబంధం లేకుండా నూతన్‌ నాయుడును ఇంట్లోంచి బయటకు పంపించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హీరోయిన్‌ మాధవిలత స్వయంగా నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ ఓట్ల ప్రకారం జరగలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశల్‌ ఆర్మీ కూడా తీవ్ర స్థాయిలో బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహంగా ఉంది. ఇలా ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేట్‌ చేయాలనుకుంటే ఎందుకు ఓటింగ్‌ కార్యక్రమం పెట్టడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్టార్‌ మా వారు స్పందించాల్సిందే అంటే బిగ్‌బాస్‌పై కౌశల్‌ ఆర్మీ ఆగ్రహంతో ఉన్నారు.

bigboss