Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ, వివి వినాయక్‌ల కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వినాయక్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. వినాయక్ స్క్రిప్ట్ వర్క్‌లో పరుచూరి బ్రదర్స్ కూడా భాగస్వామ్యులు అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ హ్యాండ్ లేని స్టార్ హీరో సినిమా లేదు. అయితే కాలం మారింది, కొత్త రచయితలు వచ్చారు. దాంతో పరుచూరి బ్రదర్స్‌కు కాస్త జోరు తగ్గింది. అయితే కొందరు స్టార్స్ మాత్రం అప్పుడప్పుడు పరుచూరి బ్రదర్స్ తలుపు తడుతూనే ఉన్నారు. ఆమద్య ‘ఖైదీ నెం.150’ చిత్రం కోసం చిరంజీవి స్వయంగా పరుచూరి బ్రదర్స్ సాయం కోరాడు. తన సినిమాకు కథ మరియు డైలాగ్స్ సహకారం అందించాలని కోరగా అందుకు పరుచూరి బ్రదర్స్ తమ వంతు సాయం అందించారు.
ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు కూడా పరుచూరి బ్రదర్స్ కలం పట్టారు. గతంలో కూడా వినాయక్‌తో కలిసి ఖైదీ నెం.150 స్క్రిప్ట్‌ను రెడీ చేసిన పరుచూరి బ్రదర్స్ ఇప్పుడు, బాలయ్య కోసం ఒక మంచి కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్ను రెడీ చేసే పనిలో ఉన్నారు. పరుచూరి బ్రదర్స్‌తో గతంలో బాలయ్య పలు చిత్రాలకు రాయించుకున్నాడు. వాటిలో సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. పరుచూపి బ్రదర్స్ పెన్ను వాడి తగ్గిందని, వారి డైలాగ్స్ ఇప్పుడు పేళవంటూ కొందరు అవహేళన చేస్తూ ఉంటారు. మరి బాలయ్య సినిమాతో మరోసారి వారి సత్తాను చూపిస్తారేమో చూడాలి. వచ్చే నెలలో ప్రారంభం అయ్యే బాలయ్య, వినాయక్‌ల చిత్రం దసరా లేదా దీపావళికి విడుదల చేసే అవకాశాలున్నాయి.