బోయపాటి చిత్రం లో నటిస్తున్న బాలకృష్ణ

బోయపాటి చిత్రం లో నటిస్తున్న బాలకృష్ణ

తాజాగా బాలకృష్ణ వైసీపీ నేతలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలకి స్పందించిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి చిత్రం లో నటిస్తున్నాడని, అంతేతప్ప బాలయ్యకి అంత సీన్ లేదని అన్నారు. తన నాన్నగారైన దివంగత ఎన్టీఆర్ వద్ద నుండి పార్టీ లాక్కున్న చంద్రబాబు వద్ద నుండి ఒక్క మంత్రి పదవి కూడా సంపాదించలేకపోయారని ఎద్దేవా చేసారు. అసలు టీడీపీ లో బాలకృష్ణ కి విలువ లేదని అన్నారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ పలు విమర్శలు గుప్పించారు. పార్టీ నుండి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే ని కూడా కాపాడుకోలేకపోయారని, సామాన్యుల ఫై రెండు చోట్ల నిలబడి ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇపుడు తన అభిమానులని తాకట్టు పెట్టి బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారని, భవిష్యత్ లో ఈ నాలుగున్నరేళ్లలో బీజేపీ లో పార్టీ ని విలీనం చేస్తారు అంటూ జోస్యం చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.