Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ‘జైసింహా’ చిత్రం తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ చిత్రాన్ని చేయాలని భావించాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే అన్ని అనుకున్నట్లుగా ‘ఎన్టీఆర్’ సినిమాకు సమకూరడం లేదు. దాంతో కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కారణంగానే బాలయ్య వెంటనే వినాయక్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. వినాయక్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ సి కళ్యాణ్ ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బాలకృష్ణ మొదట వినాయక్ దర్శకత్వంలో సినిమా చేసి, ఆ తర్వాత తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర చిత్రం ‘ఎన్టీఆర్’ను నెత్తికి ఎత్తుకుంటాడని భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా వినాయక్‌తో సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా బాలయ్య సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇదే విషయాన్ని బోయపాటి కూడా అంగీకరిస్తున్నాడు. అతి త్వరలోనే బోయపాటి తాను ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ మూవీని పూర్తి చేయబోతున్నాడు. దసరా వరకు పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారు. రామ్ చరణ్ మూవీ విడుదలకు ముందే బోయపాటి, బాలయ్య మూవీలు పట్టాలెక్కేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను బాలయ్య ఏం చేశాడో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు ఎన్టీఆర్ సినిమా విషయంలో బాలయ్య ప్లాన్స్ ఏంటో అంటూ అంతా చర్చించుకుంటున్నారు.