నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మోక్షజ్ఞను తెర మీద చూసేందుకు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ నటించిన తొలి సైన్స్ ఫిక్ష్‌న్ మూవీ ‘ఆదిత్య 369’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మరో సారి ఈ చిత్ర స్వీక్వెల్ పై స్పందిస్తూ పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.
‘ఆదిత్య 369’ సినిమాకు సంబంధించి బాలయ్య మీడియాతో ముచ్చటించారు. అందులో.. ఈ సినిమాకు సీక్వెల్‌ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు, ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పారు. అయితే ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదని చెబుతూ.. తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ‘ఆదిత్య 369’ చిత్రం అప్పట్లోనే ఓ రేంజ్ గ్రాఫిక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుత అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నెవ్వర్ బిఫోర్ అనేలా ‘ఆదిత్య 999’ మ్యాక్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మరో రెండేళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీని బట్టి చూస్తే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. ఇంకో రెండేళ్లు వెయిట్ చెయ్యాలని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గతంలో బాలయ్య.. తాను నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌తో మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.