తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదట!

Balakrishna wants to remake film MUFTI from Kannada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రం ‘ఎన్టీఆర్‌’ కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేయిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ చిత్రం తర్వాత బాలయ్య రెండు సినిమాలకు అప్పుడే కమిట్‌ అయ్యాడు. ‘ఎన్టీఆర్‌’ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రం చేసే అవకాశం ఉంది. ఆ చిత్రం తర్వాత బాలయ్య ఒక కన్నడ చిత్రాన్ని రీమేక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా బాలయ్య రీమేక్‌ చిత్రాలకు పూర్తి దూరంగా ఉంటున్నాడు. ఇతర హీరోలు రీమేక్‌లపై దృష్టి పెట్టినా బాలయ్య మాత్రం వాటిపై ఆసక్తిని కనబర్చడం లేదు. అయితే సక్సెస్‌ కావాలంటే రీమేక్‌ అయినా చేయాల్సిందే అని బాలయ్య ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చాడు.

కన్నడంలో శివరాజ్‌ కుమార్‌ హీరోగా రూపొందిన ‘మఫ్టీ’ చిత్రంను తెలుగులో రీమేక్‌ చేసేందుకు బాలయ్య సిద్దం అవుతున్నాడు. కన్నడంలో 100 కోట్లు వసూళ్లు చేసిన ‘మఫ్టీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసేందుకు ఒక స్టార్‌ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో తెలుగులో బాలయ్య హీరోగా ఆ చిత్రం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి ఒక నిర్మాత వచ్చాడు. ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 8 కోట్లు పెట్టి ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు నిర్మాత సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలయ్యతో ఆ చిత్రం వచ్చే సంవత్సరంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సక్సెస్‌ కావాలి అంటే కొన్ని సార్లు రీమేక్‌ చేయక తప్పదని బాలయ్య నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.