నాగబాబు, బాలకృష్ణ ఫాన్స్ వార్ లో వరుణ్ తేజ్ కూడా చేరాడా…?

Balayya Fans Targets Varun Tej Anthariksham Movie

నాగబాబు, బాలకృష్ణ ఫాన్స్ మద్య ఈ మద్య సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్ జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలోకి వెళ్ళితే… నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఎవరో మేకు తెలుసా అని అడిగిన ప్రశ్నకు నాకు బాలకృష్ణ ఎవరో తెలవదంటు మాట్లాడాడు. ఆ మాటలకూ నందమూరి ఫాన్స్ నాగబాబు పైన తీవ్ర ఆవేశంతో ఉన్నారు. ఈ విషయం మరిచిపోముందే నాగబాబు మరో బాంబు బాలకృష్ణ పైన పేల్చాడు అదే నాకు కమెడియన్ బాలకృష్ణ తెలుసు హీరో బాలకృష్ణ తెలవదని మరింతగా నందమూరి ఫాన్స్ ను రెచ్చగొట్టాడు. ఆ విషయం పై నందమూరి అభిమానులు ఎదో రకంగా బదులు తిర్చుకోవలనుకుంటున్నారు. అయితే నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా ను అడనివ్వం అంటూ నాగబాబుకు వరుణ్ తేజ్ కు హెచ్చరికలు పంపారు.

ఈ విషయం కు ఈ మద్య కాస్త బ్రేక్ పడింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అక్కడ జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగబాబు, బాలకృష్ణ మేటర్ గురుంచి ఆ ఇంటర్వ్యూ లో అడిగారంట దానికి వరుణ్ తేజ్ ఆ విషయం పైన చాలా ఘాటుగా స్పందించాడంట. ఆ తరువాత వరుణ్ తేజ్ మాట్లాడిన ఆ సంఘటనను కట్ చెయ్యాలని కోరాడు. ప్రస్తుతానికి అంతరిక్షం సినిమా విడుదల కావడంతో, నాగబాబు, బాలకృష్ణ ల వార్ గురుంచి మాట్లాడినవి ఇప్పుడు టెలికాస్ట్ చెయ్యవద్దని చెప్పాడంట. అంటే సినిమా విడుదలైన కొద్ది రోజుల తరువాత ఆ వీడియో బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏ సెలబ్రిటీస్ నైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందుగానే వారి పర్మిషన్ తీసుకుంటారు. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అవి సెలబ్రిటీస్ కోరికమేరకు కట్ చేస్తారు.