పడి పడి లేచే మనసు మూవీ రివ్యూ…!

Padi Padi Leche Manasu Movie Review

న‌టీన‌టులు: శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్, అభిషేక్ మ‌హ‌ర్షి త‌దిత‌రులు
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్

విభిన్నమైన పాత్రలతో కనువిందు చేస్తున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం పడిపడి లేచె మనసు. ఈ చిత్రానికి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్‌లను అందించిన హను రాఘవపుడి దర్శకుడు. ఫిదా, ఎంసీఏ లాంటి చిత్రాలతో దుమ్మురేపిన సాయిపల్లవి కథానాయిక. వీరిందరి కలయికలో రూపొందిన అందమైన ప్రేమకథ నేడు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ ముగ్గురికి పడిపడి లేచె మనసు ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

padi-padi-leche-manasu-movi
కధ :
ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా సరదాగా కాలం గడిపే పుట్‌బాల్ ప్లేయర్ సూర్య (శర్వానంద్) తొలిచూపులోనే వైశాలి( సాయిపల్లవి)తో ప్రేమలో పడుతాడు. అత‌నికి డాక్ట‌ర్ వైశాలి (సాయిప‌ల్ల‌వి) అంటే చాలా ఇష్టం. వైశాలి తండ్రి మేజిస్ట్రేట్‌. వీళ్లంద‌రూ కోల్‌క‌తాలో ఉన్న తెలుగువాళ్లు. రెండేళ్ల త‌ర్వాత వైశాలికి సూర్య అంటే ఇష్టం పెరుగుతుంది. ఒక‌రిని ఒక‌రు గాఢంగా ప్రేమించుకుంటారు. వారిద్దరూ వీడదీయలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఓ సంద‌ర్భంలో క్యాంప్ కోసం కాట్మండుకు వెళ్తుంది వైశాలి. ఆమె చూడ‌కుండా ఉండ‌లేక‌పోయిన సూర్య కూడా కాట్మండుకు వెళ్తాడు. అక్క‌డ అనుకోకుండా త‌న తండ్రిని క‌లుస్తాడు. తండ్రిని చూసిన సూర్య‌కు ప్రేమ‌పెళ్లిళ్లు నిల‌వ‌వ‌నే విష‌యం అర్ధమవుతుంది. అదే విష‌యాన్ని వైశాలికి చెబుతాడు. ఆమె లివ్ ఇన్ రిలేష‌న్‌కు వ్య‌తిరేకం కాదు, కానీ పెళ్లి చేసుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంది. ఆ క్ర‌మంలో వారిద్ద‌రు క‌లిసి కానీ ఏడాది తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకొనే ఫీలింగ్ కలిగితే వారిద్దరూ అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకొంటారు. కానీ వారిద్దరూ కలువడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భారీ ప్రమాదం జరుగుతుంది. భారీ ప్రమాదం తర్వాత సూర్య, వైశాలి కలుసుకొన్నారా? వారిద్దరి మధ్య మళ్లీ ఎలాంటి అంశాలు చోటుచేసుకొన్నాయి. తనను కలిసిన సూర్యను వైశాలి ఎందుకు దూరం పెట్టింది? తన బావ (సునీల్)తో తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్న వైశాలి తల్లిదండ్రులు ప్రయత్నం ఫలించిందా? సూర్య తల్లిదండ్రులు (ప్రియా రామన్, సంపత్ రాజ్) విడిపోవడానికి అసలు కారణం ఏమిటి? తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వైశాలితో ప్రేమపై ఎలాంటి ప్రభావం పడింది. విడిపోయిన సూర్య తల్లిదండ్రులు మళ్లీ కలుసుకొన్నారా? ఇలాంటి ట్విస్టుల మధ్య సాగేదీ ఈ కధ.

sai-pallavi-movie

విశ్లేషణ :
వైశాలిని ప్రేమించాడనికి సూర్య ఆడే డ్రామా రొటీన్‌గా ఉన్నప్పటికీ.. ఆకట్టుకోగలిగింది. తొలి భాగంలో కొంత సాగదీత అనిపించినప్పటికీ శర్వానంద్, సాయిపల్లవి ఫెర్ఫార్మెన్స్‌ ఆ లోపాన్ని సరిదిద్దగలిగింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌ రెండోభాగంపై ఆసక్తిని పెంపొందించడం జరుగుతుంది. రెండో భాగంలో సూర్య, వైశాలి కలుస్తారనే ఆసక్తికి ఓ భారీ ట్విస్ట్ ఇవ్వడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ మతిమరుపు అనే అంశం ప్రేక్షకుడిని చాలానే ఇబ్బందికి గురిచేసేలా ఉంటుంది. అంతేకాకుండా ఫీల్‌గుడ్‌ను కథను కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి నెట్టివేసినట్టు కనిపిస్తుంది. సునీల్ ఎంట్రీతో కథలో ఏదైనా ప్రభావవంతమైన మలుపు తిరుగుతుందా అని ఎదురుచూస్తే కొంత నిరాశే ఎదురవుతుంది. సాగదీత ధోరణిలో, కృత్రిమమైన ట్విస్టులు కథలో ఉండే మ్యాజిక్‌ను దెబ్బ తీశాయనే ఫీలింగ్ సెకండాఫ్‌లో కలుగుతుంది. కోల్‌క‌తా నేప‌థ్యం, కొన్ని లొకేష‌న్లు, కాన్ ఫ్లిక్ట్ అంతా బాగానే ఉంది. కానీ ఏ సీనుకు ఆ సీను ప్ర‌త్యేకంగా అనిపిస్తుందే త‌ప్ప‌, క‌థ‌లో ఎక్క‌డా క‌లిసిన‌ట్టు క‌నిపించ‌దు. హీరోయిన్ తండ్రి అంతు చూడాల‌నుకున్న రౌడీ ముఠా ఎవ‌రో ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చారు. అయితే వాళ్లెవ‌రో చివ‌రికి కూడా క‌నిపించ‌రు.

sai-pallavbipadi-padi-leche

టైటిల్ సాంగ్ మిన‌హా మిగిలిన‌వి క‌థ‌లో భాగంగా క‌దులుతుంటాయేగానీ, పెద్ద‌గా క‌నెక్ట్ అయిన‌ట్టు క‌నిపించ‌వు. ఒక వైపు వెన్నెల‌కిశోర్‌, సునీల్‌, ప్రియ‌ద‌ర్శి లాంటి క‌మెడియ‌న్లున్నా, ఎక్క‌డా కామెడీ పండ‌దు. సునీల్ పాత్ర కూడా స్పెష‌ల్‌గా ఏమీ అనిపించ‌దు. ఈ తరం దర్శకుల్లో సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కాని విధంగా కథ చెబుతాడనే విమర్శ హను మీద ఉంది. కానీ కృష్ణగాడి ప్రేమకథతో ట్రాక్‌లో పడ్డాడనిపించింది. అయితే పడి పడి లేచే విషయానికి వస్తే తొలిభాగంపై పట్టుబిగించిన ఆయన రెండో భాగంలో గందరగోళంలో పడేశాడు. మళ్లీ తన మేథోశక్తిని కొంచెం గట్టిగానే ఉపయోగించడం కథ అదుపు తప్పినట్టు అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎవరికీ వంక పెట్టలేని విధంగా ఉంది. ఇక వైశాలి పాత్రతో గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగా సాయిపల్లవి మరోసారి తానేంటో నిరూపించుకొన్నది. తొలిభాగంలో చిలిపిగా, రెండోభాగంలో రెట్రోగ్రేడ్ అమ్నిషియా వ్యాధికి గురైన అమ్మాయిగా అద్బుతంగా నటించింది. డ్యాన్సులతో అదరగొట్టింది. ఎమోషనల్ సీన్లలో ఎప్పటిలానే తన సత్తాను చూపించింది. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్స్ చూస్తే కథకు కావాల్సిన లోకేషన్ల విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. నేపాల్, కోల్‌కతా లోకేషన్ల ఎంపిక బాగుంది.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : పడిపడి లేచే ‘భావోద్వేగాలు’
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5 / 5