Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బాలయ్య గత కొంత కాలంగా చేస్తున్న సినిమాలు నందమూరి ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. బాలయ్య ఈ మద్య చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మినహా రెండు సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు అన్ని కూడా బాక్సాపీస్ వద్ద ఫ్లాప్ అవుతూ వచ్చాయి. తాజాగా విడుదలైన జైసింహా అంతకు ముందు వచ్చిన పైసా వసూల్ చిత్రం కూడా దారుణ పరాజయం పాలైంది. అయితే ఏమాత్రం నిరుత్సాహపడకుండా, తన పని తాను చేసుకు పోతాను, సినిమాల సక్సెస్ విషయంతో సంబంధం లేదు అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నాడు. అప్పుడు బాలయ్య మూడు నాలుగు ప్రాజెక్ట్‌లకు కమిట్ అయ్యాడు.
బాలయ్య ‘జైసింహా’ విడుదల కాకముందే తన తండ్రి ‘ఎన్టీఆర్’ జీవిత చరిత్రతో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని బాలయ్య చేసేందుకు కమిట్ అయ్యారు. ఈ సమయంలోనే బాలకృష్ణకు మరో బయోపిక్‌పై దృష్టి పడ్డట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ షష్టిపూర్తి వయస్సుకు దగ్గర పడుతున్నారు. తన వయస్సు 60కు చేరిన తర్వాత హిందూ మత పెద్ద అయిన రామానుజాచార్య జీవిత చరిత్రతో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాదిరిగానే రామానుజాచార్య చరిత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే బాలయ్య ఈ చరిత్రను చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.