బాలయ్య, వెంకటేష్: సంక్రాంతి సందడి!

Balayya, Venkatesh: Sankranthi buzz!
Balayya, Venkatesh: Sankranthi buzz!

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సూపర్ హిట్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 జరుగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక షోకు వచ్చిన గెస్ట్ లను బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఆటపట్టిస్తూ.. అలరిస్తున్నారు. తమ మూవీ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలని కూడా అడిగి తెలుసుకుంటున్నారు బాలకృష్ణ. అలాగే గెస్ట్ లతో గేమ్స్ ఆడిస్తూ.. వాళ్ళతో డాన్స్ లు చేస్తూ మెప్పిస్తున్నారు.

Balayya, Venkatesh: Sankranthi buzz!
Balayya, Venkatesh: Sankranthi buzz!

తాజాగా బాలయ్య షోకు విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. వెంకటేష్ తో కలిసి బాలకృష్ణ సందడి చేశారు. తాజాగా బాలయ్య, వెంకటేష్ ఎపిసోడ్ టీజర్ ను విడుదల చేశారు. ఇద్దరు ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా ఉండేవాళ్ళం అని గుర్తు చేసుకున్నారు. అలాగే బాలకృష్ణ షోకు వెంకటేష్ తో పాటు ఆయన సోదరుడు నిర్మాత, దగ్గుబాటి సురేష్ బాబు కూడా హాజరయ్యారు. చిన్నప్పుడు వెంకటేష్ చేసిన అల్లరి గురించి సురేష్ బాబును అడిగి నబాగా నవ్వుకున్నారు .

అలాగే ఈ టాక్ షోలో వెంకటేష్ తండ్రి లెజెండ్రీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గురించి కూడా ప్రస్తావించారు బాలయ్య. రామానాయుడు గురించి చెప్తూ సురేష్ బాబు, వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. అలాగే వెంకటేష్ కూతుర్ల గురించి అలాగే మేనల్లుడు నాగ చైతన్య గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నలు వేశారు. ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.