బాలయ్య నిర్ణయాన్ని తప్పుబడుతున్న ఫ్యాన్స్‌

Balayya's Decision Are Blaming In Nandamuri Fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Balayya’s Decision Are Blaming   In Nandamuri Fans

నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారు మరియు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా నందమూరి ఫ్యాన్స్‌ కొత్త హీరో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మద్య బాలయ్య 2017లో తనయుడి ఎంట్రీ ఉంటుందని అధికారింకగా చెప్పుకొచ్చాడు. ఈ సంవత్సరం చివర్లో మోక్షజ్ఞ సినిమాను ప్రారంభించాలని బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు వంద కథలను బాలయ్య కొడుకు కోసం విన్నట్లుగా తెలుస్తోంది. వాటిల్లో కొన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఉన్నట్లుగా మోక్షజ్ఞ మరాఠి సూపర్‌ హిట్‌ చిత్రం ‘సైరాట్‌’ రీమేక్‌ ద్వారా పరిచయం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మోక్షజ్ఞ మొదటి సినిమాను ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి సినిమాను ఒక రీమేక్‌గా చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ స్వయంగా ఫ్యాన్స్‌ అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోక్షజ్ఞ రీమేక్‌తో రావద్దని, మొదటి సినిమా ఖచ్చితంగా డైరెక్ట్‌ సినిమా అవ్వాలని, తెలుగు కథతోనే రావాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. బాలయ్య ఇలా ఎలా ఆలోచిస్తున్నాడంటూ కొందరు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం పుకార్లను కొట్టి పారేస్తున్నారు. రీమేక్‌లు అంటేనే బాలయ్యకు పెద్దగా ఇష్టం ఉండదు, అలాంటిది తనయుడిని రీమేక్‌తో ఎలా పరిచయం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. మోక్షజ్ఞ కొత్త సినిమా అతి త్వరలోనే ప్రారంభిస్తారని నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు:

బతిమిలాడి ఒప్పించారు

రిలేషన్‌ కొనసాగుతూనే ఉంది.. ఇదే సాక్ష్యం