మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య కీలక వాక్యాలు…… !

Balayya's key words on Mokshajna's entry... ... !
Balayya's key words on Mokshajna's entry... ... !

ఈ మధ్య కాలంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకి నందమూరి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో తన తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగం లోకి దిగారని ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు బాలయ్య.మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ లో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. ఇక టీజర్, గ్లింప్స్ వీడియోస్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Balayya's key words on Mokshajna's entry... ... !
Balayya’s key words on Mokshajna’s entry… … !

ప్రస్తుతం బాలయ్య స్పీచ్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బాలయ్య మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక మూవీ డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతానని అన్నారు. సినిమా అంటే తనకు ఫ్యాషన్ అని అన్నాడు తన తండ్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుక జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్ర పరిశ్రమలో తాను కొద్దిమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటానని అన్నారు. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నానని.. సినిమాల కు, పాత్రల కు ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకువచ్చేందుకు ట్రై చేస్తుంటానని అన్నారు. ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని.. ఈ విషయం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని అన్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారింది . .