ప్రజకూటమి కాదు ప్రజాద్రోహుల కూటమి – బాల్క సుమన్

Balka Suman Comments On Tdp And Congress Party

2014 ఎన్నికల్లో ఎంపీ గా ఎన్నికైన బాల్క సుమన్ రాబోతున్న 2018 తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ తరపున ఎమ్మెల్యే గా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన రెండో విడత ప్రచారాన్ని కోటపల్లి మండలంకి చెందిన కొల్లూర్, రాంపూర్, పారుపల్లి, వెల్మపల్లి, దేవులవాడ, రేపనపల్లి మరియు బబ్బెరచెలుక గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. ఈ ప్రచారంలో బాల్క సుమన్ తమ తెరాస పార్టీ ప్రెసిడెంట్ అయిన కెసిఆర్ ని విపరీతంగా పొగిడేస్తూ, సాక్షాత్తూ శ్రీరాముడి తో పోల్చడం జరిగింది. తెలంగాణాలో కేసీఆర్ పాలన శ్రీరాముని పాలన వలె ఉందని, తన పాలనలో కేసీఆర్ అనేక పథకాలు చేపట్టాడని, రాబోయే ఎన్నికల్లో మళ్ళి కేసీఆర్ తెలంగాణ పీఠం ఎక్కితే, ఇప్పుడున్న పథకాల్లోని లబ్ధిని రెండింతలు చేస్తాడని, ఇప్పటికే తన పాలనతో తెలంగాణ ని అభివృద్ధిలో ముందుకు నడిపి, దేశం గర్వించే పథకాల్ని ప్రవేశపెట్టి, ప్రజలకు అండగా ఉన్నాడని కొనియాడాడు. రాష్ట్రంలో ఇంతవరకు జరగని అభివృద్ధి కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపెట్టారని, అందులో భాగంగా ప్రజలకోసం వివిధ సంక్షేమ పథకాలు, ఇంటింటికి నీరు అందించేందుకు నీటిపారుదల ప్రాజెక్టులకి మార్పులు చేశారని, ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంకి చేసిన నష్టం సరిదిద్దాలంటే కనీసం ఇరవై ఏళ్ళ సమయం పడుతుందని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి మళ్ళీ పట్టం కట్టి, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, అభివృద్ధిని సాధించుకోవాలని ప్రజలకు హితవు చెప్పాడు.

Strike At Gandhi Bhavan And Ntr Bhavan Over Mla Tickets

అంతేకాకుండా, తెలంగాణాలో ప్రజల ఆశీస్సులతో బలంగా ఉన్న తెరాస పార్టీ ని ఓడించాలనే ఒకే ఒక్క ఆశతో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి ప్రజకూటమి ని ఏర్పాటుచేశారని, ఇది ప్రజకూటమి కాదు ప్రజాద్రోహుల కూటమి అని, ఈ పార్టీ లో ఉన్న అందరూ ద్రోహులే అని బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశాడు. రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నిరంతరం నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటానని, ప్రజల కష్టసుఖాలు చూసుకుంటానని, నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని బాల్క సుమన్ మాట ఇచ్చాడు. అయినా, ఈ బాల్క సుమన్ మాటని నమ్మేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అనుమానం. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ అనే పేరు మీద 2014 ఎన్నికల్లో ఎంపీ అయ్యాక, కనీసం ఒక్కసారి కూడా ఓయూ ని సందర్శించకుండా, విద్యార్థుల మరియు నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తకుండా, కేసీఆర్ కి చెప్పులా వ్యవహరించాడని ఓయూ విద్యార్థులు బాల్క సుమన్ మీద దుమ్మేస్తూపోస్తుండగా, ఇంతవరకు రాష్ట్రంలోని నాయకుల పరిపాలనని సూక్ష్మంగా గమనిస్తున్న ప్రజలు బాల్క సుమన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది త్వరలోనే తేలిపోతుంది.

kcr-balka-suman