థాంక్స్ సుమంత్ అంటూ… స్పందించిన ప్రిన్స్

Hero Sumanth Respond In Mahesh Babu Twitter

మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. మహేష్ బాబు తెలుగు, తమిళంలో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. కృష్ణ గారు చూపిన బాటలో ప్రయాణిస్తూ తండ్రి కి దగ్గ కొడుకు అని నిరుపించుకుంటు వస్తున్నాడు. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో 106 ఏళ్ల వృద్ద అభిమాని గురించి మహేశ్ తెలుసుకున్నాడు. ఆమె కోరుకున్నట్లుగా ఆమెను కలిసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

mahesh-sumanth

తాజాగా వంద సంవత్సరాలు నిండిన ఆ వృద్దురాలిని కలిసి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్ని ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అయింది. ఈ విషయంపై అక్కినేని నాగేశ్వరావు మనవడు సుమంత్ స్పందించాడు. సుమంత్ ట్విట్టర్ లో.. “మీరు పెద్ద వాళ్ళకు గౌరవం ఇచ్చేనటుడు అని ఎప్పుడు అంటూ ఉండేవారు. మా తాత గారికి ఈ తరం నట్టులో మీరు అంటే చాలా ఇష్టం” అంటూ పోస్ట్ చేశాడు. దానికి మహేష్ సమాధానంగా “థాంక్స్ సుమంత్, ఏఎన్‌ఆర్ గారు ఎన్నో విధాలు గా నాకు ఎప్పటికి ఆదర్శప్రాయులు అని అన్నాడు. ఈ పోస్ట్ తో అక్కినేని అభిమానులు మహేష్ ని తమదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తారు.

Mahesh Babu Meets Satyavati In Rajahmundry