వారం వ్యవధిలోనే రెండు సినిమాలు…!

Sumanth Next Two Movies Release On December

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌ ఈమద్య చిన్న చిన్న సక్సెస్‌లు దక్కించుకుంటున్న కారణంగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా సుమంత్‌ 25వ చిత్రం ‘సుబ్రమణ్య పురం’ను చేశాడు. ఆ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో ఆకట్టుకునే కథనంతో ఈ చిత్రంను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్‌ 7న సుబ్రమణ్యం పురం చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఆ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే సుమంత్‌ నటించిన మరో విభిన్న చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఇదం జగత్‌ టైటిల్‌తో రూపొందిన సుమంత్‌ చిత్రం ఆమద్య అందరి దృష్టిని ఆకర్షించింది. కాని ఏదో కారణం వల్ల సినిమా ఆగిపోయింది.

sumanth-telugu-subramanianp

‘ఇదంజగత్‌’ చిత్రం పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం మీడియాపై సెటైరికల్‌గా ఉంటుందని సమాచారం అందుతుంది. మీడియాలో పోటీ పెరిగిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయాలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ‘సుబ్రమణ్యపురం’ విడుదలైన వారం రోజులకు అంటే డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమద్య కాలంలో ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు ఒకే నెలలో అది కూడా ఒకే వారం తేడాతో రావడం చాలా అరుదుగా జరిగిందని చెప్పుకోవాలి. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి వారి సినిమాలు వరుసగా వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక సారి ఒకే సినిమా మాత్రమే చేయగలుగుతున్నారు.

sumanth-idam-jagath-movie