సక్సెస్‌ రాకతో ప్రయోగం చేస్తున్నాడు

sumanth negative role in the next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సుదీర్ఘ కాలంగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్‌ సక్సెస్‌ కోసం పోరాటం చేస్తున్నాడు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్‌ అవుతూ వస్తున్న నేపథ్యంలో సుమంత్‌ ఇక హీరోగా చేయవద్దని కొందరు సలహా ఇచ్చారు. కాని సుమంత్‌ మాత్రం డబ్బు కోసం కాదు తాను సినిమా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా సుమంత్‌ ‘మళ్లీరావా’ అనే చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా సుమంత్‌ సినీ కెరీర్‌కు ప్రాణం పోసింది.

‘మళ్లీ రావా’ అందించిన సక్సెస్‌తో సుమంత్‌ వెంటనే మరో సినిమాను మొదలు పెట్టాడు. సహజంగా అయితే సినిమా సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటూ ఉండే సుమంత్‌ ఈసారి మాత్రం వెంటనే తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. కొత్త దర్శకుడితో సుమంత్‌ ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాలో సుమంత్‌ పాత్ర నెగటివ్‌ ఛాయలో ఉంటుందని, మొదటి సారి సుమంత్‌ నెగటివ్‌ పాత్రను చేస్తుండటం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఈ సినిమాతో సుమంత్‌ మరో సక్సెస్‌ను దక్కించుకుంటే ఇకపై పూర్తి స్థాయి విలన్‌గా సుమంత్‌ ప్రయత్నిస్తాడేమో చూడాలి.