సునీల్‌ ఇక సర్దేసుకున్నట్లే..!

Sunil Turns again as Comedian after 2 countries

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించి, స్టార్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సునీల్‌ ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’ అనే చిత్రం చేసి ఫుల్‌ టైం హీరోగా మారిపోయాడు. అప్పటి నుండి హీరోగా చేస్తూనే ఉన్న సునీల్‌కు సక్సెస్‌లు తక్కువ ఫ్లాప్‌లు ఎక్కువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇటీవల సునీల్‌ హీరోగా నటించిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ను దక్కించుకోలేదు. తాజాగా సునీల్‌ నటించిన ‘2 కంట్రీస్‌’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్‌ ఆ సినిమాతో కూడా సక్సెస్‌ కాలేక పోయాడు. ‘2 కంట్రీస్‌’ చిత్రంతో సునీల్‌ ఇక హీరోగా పనికి రాడు అని తేలిపోయింది.

సునీల్‌ ‘2 కంట్రీస్‌’ చిత్రంలో కనిపించిన తీరు చూస్తుంటే ఇక హీరోగా చేయాలని సునీల్‌కు లేదని, ఆయన పూర్తిగా కమెడియన్‌గా మళ్లీ మారిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తుంది. గతంలో సునీల్‌ కమెడియన్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నాడు. హీరోగా సునీల్‌ స్లిమ్‌ బాడీతో, కండలు పెంచి, సిక్స్‌ ప్యాక్‌ను మెయింటెన్‌ చేశాడు. కాని ఇప్పుడు కడుపు పెంచి, కండల స్థానంలో ఒల్లంత పెంచి లావుగా తయారు అయ్యాడు.

ఈ చిత్రం తర్వాత సునీల్‌ మళ్లీ హీరోగా సినిమాలు చేయాలని భావించడం లేదని తేలిపోయింది. హీరోగా ఇక సునీల్‌ అన్ని సర్దేసుకున్నట్లే అని, ఒక వేళ చేసినా కూడా ముఖ్య పాత్రల్లో లేదా కమెడిన్‌గా చేయాలని సునీల్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో మంది కమెడియన్స్‌ హీరోలుగా మారి, మళ్లీ కమెడియన్స్‌గా అయ్యారు. అలాగే సునీల్‌ కూడా హీరోగా సక్సెస్‌లు రాకపోవడంతో కమెడియన్‌గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.