బాలయ్యకు కఠిన పరీక్ష!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బాలకృష్ణ 102వ చిత్రం ‘జైసింహా’ విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా, హరిప్రియలు హీరోయిన్స్‌గా నటించారు. బాలయ్య ద్వి పాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించాడు. సి కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది. మరి కొన్ని రోజుల్లోనే సెన్సార్‌ బోర్డు ముందుకు కూడా ఈ చిత్రం వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కాస్త ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానంతో డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా ఈ చిత్రాన్ని కొనుగోలు చేయలేదు. దాంతో నిర్మాత సి కళ్యాణ్‌ తానే స్వయంగా విడుదల చేస్తున్నాడు.

  Surya Gang Movie and Pawan Kalyan Agnathavasi and Jai Simha movie

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ‘జైసింహా’ విడుదలకు రెండు రోజుల ముందు అంటే జనవరి 10 పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతుంది. దాంతో పాటు ‘జైసింహా’ విడుదల కాబోతున్న రోజే సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం తెలుగులో ‘గ్యాంగ్‌’గా విడుదల కాబోతుంది. అజ్ఞాతవాసి వల్ల సమస్య ఉంటుందని భయపడుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు సూర్య ‘గ్యాంగ్‌’ వల్ల కూడా టెన్షన్‌ పడుతున్నారు. తమిళ హీరో అయిన సూర్య తెలుగులో కూడా మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. దాంతో ‘గ్యాంగ్‌’పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక వేళ ‘గ్యాంగ్‌’కు పాజిటివ్‌ టాక్‌ వస్తే ‘జైసింహా’ చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.