సుమంత్‌ బ్యాడ్‌ టైం మామూలుగా లేదుగా..!

Sumanth Malli Raava movie get positive Talk but no theaters

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో కొనసాగుతూ వస్తున్న సుమంత్‌కు చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా లేదు. ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఎక్కువ డిజాస్టర్‌ అవ్వగా కొన్ని మాత్రం పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. అయినా కూడా తాను డబ్బుకోసం కాదు, అభిరుచితో సినిమాలు చేస్తున్నాను అంటూ అప్పుడప్పుడు చిత్రాలు చేస్తూ సుమంత్‌ టాలీవుడ్‌లో తన ప్రభావంను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తు ఉంటాడు. తాజాగా సుమంత్‌ ‘మళ్లీరావా’ అనే చిత్రాన్ని చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మళ్లీరావా’ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది. అయితే అది కేవలం మల్టీప్లెక్స్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మాత్రమే ఉందని మొదటి నుండి టాక్‌ రావడంతో బి మరియు సి సెంటర్లలో సినిమాను ఆధరించే వారే కరువయ్యారు. అప్పుడే సంగం థియేటర్లను ఖాళీ చేశారు. ఇక మల్టీప్లెక్స్‌ థియేటర్లలో కూడా ప్రేక్షకులు ‘మళ్లీరావా’ సినిమాపై ఆసక్తి చూపడం లేదు. కారణం ఇతర సినిమాలు ‘మళ్లీ రావా’ చిత్రం కంటే ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ మరియు ‘ఆక్సీజన్‌’, ‘జవాన్‌’ చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాల ముందు మళ్లీరావా చిత్రం తేలిపోతుంది. దీంతో సుమంత్‌ బ్యాడ్‌ టైం మామూుగా లేదు అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.