సంక్రాంతి రేసులో మరో మూవీ?

raj tarun raju gadu movie releasing in sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2017 సంక్రాంతి బరిలో మెగా మూవీ ‘ఖైదీ నెం.150’ మరియు నందమూరి మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు చిత్రాలతో పాటు శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘శతమానంభవతి’ అనే చిన్న చిత్రం కూడా విడుదల అయ్యింది. ఈమూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చిన్న సినిమా అయిన శతమానంభవతి కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టడంతో వచ్చే సంక్రాంతికి సినిమాలు వచ్చేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతికి ఖరారు అయ్యింది. ఇక బాలయ్య ‘జైసింహా’ చిత్రం కూడా సంక్రాంతికి వస్తుందని ప్రకటన వచ్చింది.

raj-tarun-raju-gadu-movie

రెండు పెద్ద చిత్రాలతో పాటు 2018 సంక్రాంతికి కూడా ఒక చిన్న చిత్రంగా ‘రాజుగాడు’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ‘రాజుగాడు’ చిత్రం విడుదలకు సిద్ద అయ్యిందని, సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను దర్శకుడు సంజనారెడ్డి తెలియజేయడం జరిగింది. రాజ్‌ తరుణ్‌, అమైరా దస్తూర్‌ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పథాకంపై నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాపై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని సంక్రాంతికి పెద్ద పోటీ ఉన్నా కూడా విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.