ఆడియోకు ఓకే చెప్పిన పవన్‌

pawan kalyan agnathavasi movie audio release fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మొదట అమరావతిలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆడియో వేడుకపై పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తిగా లేడని, పవన్‌ సూచన మేరకు సినిమా ఆడియో విడుదల వేడుకను క్యాన్సిల్‌ చేసినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత మరియు దర్శకుడు కలిసి పవన్‌ను ఆడియో వేడుకకు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈనెలలోనే ఆడియో వేడుక ఉండబోతుంది.

ఆడియోకు ఓకే చెప్పిన పవన్‌ - Telugu Bullet

ఈ చిత్రం పవన్‌కు 25వ చిత్రం అవ్వడం వల్ల ఫ్యాన్స్‌ ప్రత్యేకంగా భావిస్తున్నారు. వారి కోరిక మేరకు, వారి ఆనందం కోసం చిత్ర ఆడియో విడుదల వేడుక జరపాలని దర్శకుడు త్రివిక్రమ్‌ భావించడం, అదే విషయాన్ని పవన్‌కు చెప్పడంతో పవన్‌ ఓకే చెప్పాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. మరో వారం రోజుల్లో మొదటి కాపీ సిద్దం అవుతుంది. ఆ తర్వాత సినిమా ఆడియో వేడుకను జరుపనున్నారు. ఇప్పటికే ఒక పాట విడుదల అయ్యింది. రెండవ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ మరియు మిగిలిన పాటలను వేడుక చేసి విడుదల చేయబోతున్నారు. కీర్తి సురేష్‌, అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంతో పవన్‌ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.