‘హలో’కు ప్రియా సెంటిమెంట్‌ కలిసి వచ్చేనా?

Vikarm k kumar Repeated Priya Sentiment in Akhil Hello movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి సినిమాను పూర్తిగా మర్చి పోయి ‘హలో’ చిత్రాన్ని తన మొదటి సినిమాగా భావించి చేశాడు. ప్రమోషన్‌లో కూడా మొదటి సినిమా గురించి ఎలాంటి మాటలు మాట్లాడకుండా ‘హలో’పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. కెరీర్‌ ఆరంభం నుండి కూడా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ తన సినిమాల్లోని హీరోయిన్స్‌ పాత్రకు ప్రియా అనే పేరు పెడుతూ వస్తున్నాడు. మొదటి సినిమా ‘ఇష్టం’ చిత్రానికి మినహా మిగిలిన అన్ని చిత్రాల్లో కూడా హీరోయిన్‌ పేరును ప్రియా అంటూ పెట్టాడు. ఆ సెంటిమెంట్‌ను ‘హలో’ లో కూడా కంటిన్యూ చేశాడు.

‘మనం’ చిత్రంలో సమంత పేరును ప్రియాగా పెట్టి సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు సెంటిమెంట్‌ కంటిన్యూ చేస్తూ ప్రియా అనే పేరు పెట్టడం కూడా సినిమాకు కలిసి వస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలోని పాటలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. మొత్తానికి సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని, అన్ని అంశాలు కూడా హలోకు కలిసి వచ్చేలా ఉన్నాయని అక్కినేని ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 22న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్‌గా ఈ చిత్రంతో పరిచయం కాబోతుంది. తెలుగులో ఈమెకు మంచి పేరు దక్కడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.