అక్కినేని హీరోలు నాగార్జున-నాగ చైతన్యలు నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. . కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రపంచవ్యాప్తంగా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిచేసుకున్న‘బంగార్రాజు’చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన సంగతి తెలిసిందే.