బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

భరించలేని పని ఒత్తిడి ఓ వైపు.. ఆందోళన మరో వైపు వెరసి ఓ బ్యాంకు ఉద్యోగి బలవన్మరణానికి కారణమైంది. ఈ సంఘటన స్థానిక వాణి నగర్‌ మొదటి వీధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, ఉద్యోగులు కథనం ప్రకారం మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాకు చెందిన ఐశ్వర్య నర్‌నత్‌ రణ్‌దేవ్‌ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో బంధువులు పిన్ని, బాబాయి పెంచి పెద్ద చేశారు.

ఉన్నతంగా చదువుకున్న ఐశ్వర్య పట్టుదలతో రెండేళ్ల క్రితం బ్యాంక్‌ ఉద్యోగం సాధించింది. ఆరు నెలల క్రితం టంగుటూరి సిండికేట్‌ బ్యాంక్‌ శాఖలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది. అయితే చిన్న పనులకే ఒత్తిడి గురవుతుండేదని తోటి సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం అధికారులకు రిజైన్‌ పత్రాలను అందించింది. కానీ ఉద్యోగం లేకపోతే ఏం చేయాలో తెలియక.. ఈ పని చేయలేక మానసికంగా కుంగిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్య తాను నివసిస్తున్న బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.