13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ ఉద్యోగ నియామక పరీక్ష

Bank Job Placement Examination in thirteen Regional Languages

బ్యాంక్ ఉద్యోగ నియామక పరీక్షలు ఇకపై 13 భాషల్లో రాసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. ఇప్పటి వరకు హింది, అంగ్లంలోనే పరీక్ష రాసే అవకాశం ఉండేది. ఇప్పటి నుంచి బ్యాంక్ ఉద్యోగాల పరీక్షలు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఆర్థిక స‌ర్వే నివేదిక‌ను ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత సీతారామ‌న్ మాట్లాడారు. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వ‌ల్ల స్థానిక భాష‌లో విద్య నేర్చుకున్న విద్యార్థుల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌న్నారు. బ్యాంకుల్లో ర్యాంక్ ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. అయితే స్థానిక యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో.. బ్యాంకు ప‌రీక్ష‌ల‌ను ప్రాంతీయ భాష‌ల్లో నిర్వహించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మ‌రాఠీ, త‌మిళం, తెలుగు, ఉర్దూ, కొంక‌ణి, అస్సామీతో పాటు ఇత‌ర భాష‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.