జస్‌ప్రీత్ బుమ్రా వెన్నుభాగంలో చిన్న చీలిక వల్ల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. మెరుగైన వైద్యం అందించాలనే బీసీసీఐ వైద్యచికిత్సకోసం బ్రిటన్‌కి పంపబోతుంది.గతనెలలో నార్మల్ రేడియాలజీ టెస్టులని క్రికెటర్లకి నిర్వహించిన పరీక్షల్లో బుమ్రా వెన్నుభాగంలో చిన్నచీలికను వైద్యులు నిర్దారించారు. కాబట్టి భారత సెలక్టర్లు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ని జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఎంపిక చేశారు.
కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని సూచించినా.. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఆశిష్ కౌశిక్ అభిప్రాయ ప్రకారం ఈ ఫాస్ట్ బౌలర్ బుమ్రాని మెరుగైన వైద్యం కొరకి బ్రిటన్‌కి పంపాలని బీసీసీఐ నిర్ణయించింది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉంచి వైద్యచికిత్సలు అదించిన గాయం మరీ సున్నితం అయినందువల్ల బ్రిటన్‌లో చికిత్స కోసం బీసీసీఐ జస్‌ప్రీత్ బుమ్రాని పంపనుంది.