వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో మూడు టీ20 ల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇండోర్ అండ్ అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల కోసం 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లను వీక్షించవచ్చు అని భావించిన ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేనుట్లు తెలుస్తోంది.
మేము ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేము. అహ్మదాబాద్‌లో వన్డే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టీ20లకు కూడా వర్తింపజేయాలి అని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. మరో వైపు విండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు ఆటగాళ్లతో పాటు నాలుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక విండీస్- భారత్ తొలి వన్డే అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న జరగనుంది.