Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎత్తుపల్లాల దారిలోబతుకుబండిని సాఫీగా నడపడం ఎవరికీ సులభం కాదు. క్లిష్టంగా, అతి కష్టంగా కనిపించే ఈ దారిలో సాఫీగా వెళ్లాలంటే ఎదుటి వాళ్ళు మారాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమవైపు నుంచి ఏమి చేయాలో, ప్రస్తుతం ప్రపంచం ఎలా నడుస్తుందో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించరు. దీంతో మార్గం ఎగుడుదిగుడుగా కనిపిస్తుంది. గమ్యం మరీ దూరం అవుతుంది. ఈ పరిస్థితి మారి జీవితం సాఫీగా వెళ్లాలంటే అనుక్షణం 8 నగ్న సత్యాల్ని దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి.
1 . ఈ ప్రపంచంలో తల్లి తప్ప ఏదీ నిజం కాదు.
2 . పేదవాడికి స్నేహితులు వుండరు.
3 . జనానికి మంచి ఆలోచనలు నచ్చవు. అందమైన మొహాలు మాత్రమే నచ్చుతాయి.
4 . జనం డబ్బుకి గౌరవం ఇస్తారు కానీ మనిషికి కాదు
5 . నువ్వు ఎవరినైతే బాగా ప్రేమిస్తావో వారి వల్లే ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది.
6 . సత్యం చాలా సరళంగా ఉంటుంది. కానీ దాన్ని వివరించబోతే కష్టంగా అనిపిస్తుంది.
7 . మీరు సంతోషంగా వున్నప్పుడు పాటలో సంగీతాన్ని ఆస్వాదిస్తారు. విచారంగా వున్నప్పుడు అందులోని సాహిత్యాన్ని అర్ధం చేసుకుంటారు.
8 . జీవితంలో మనం ఎలాంటి వాళ్ళమో రెండే విషయాలు చెప్తాయి.” నీ దగ్గర ఏమీ లేనప్పుడు సహనం, నీ దగ్గర అన్నీ వున్నప్పుడు ప్రవర్తించే విధానం”.
పైన చెప్పుకున్న 8 విషయాలు కటువుగా అనిపించినా కఠిన వాస్తవాలు. ఆ వాస్తవాల్ని గమనించి వాటికి తగ్గట్టు నడుచుకుంటే మీ జీవితమనే బండి సాఫీగా వెళ్ళిపోతుంది.