బ్యూటీ “ప్రేమలు” వీడియోతో ఇంటర్నెట్ షేక్!

Beauty shakes the internet with
Beauty shakes the internet with "Loves" video!

లేటెస్ట్ గా మళయాళ మూవీ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన పలు మూవీ లో యూత్ ఫుల్ హిట్ మూవీ “ప్రేమలు”(Premalu) కూడా ఒకటి. మరి ఈ మూవీ లో కనిపించిన యంగ్ అండ్ క్యూట్ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) మంచి అట్రాక్షన్ గా కూడా నిలిచింది. ఒక్క మళయాళ ప్రేక్షకుల్లోనే కాకుండా లేటెస్ట్ గా తెలుగులో రిలీజ్ అయ్యాక తెలుగు యువత హృదయాలు కూడా ఈ యంగ్ నటి కొల్లగొట్టింది.

దీనితో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి గుర్తింపు ని తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ తాలూకా ఒక క్యూట్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి రీసెంట్ గా జరిగిన ఒక పెళ్లి ఈవెంట్ లో అయితే ఆమె తన డాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేసింది.

Beauty shakes the internet with "Loves" video!
Beauty shakes the internet with “Loves” video!

దీనితో ఇప్పుడు ఆమెకి వచ్చిన ఫేమ్ లో భాగంగా ఓల్డ్ వీడియో అయినప్పటికీ నెటిజన్స్ ఆమెపై ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ప్రేమలు మూవీ లో నస్లన్ కే గఫూర్తదితరులు నటించగా గిరీష్ ఏ డి దర్శకత్వం వహించారు. అలాగే తెలుగులో ఈ మూవీ ని ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేసాడు.