ఆన్ లైన్ లో అడుక్కుంది….జైలు పాలయ్యింది

begging in online

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భర్త చనిపోయాడు. పిల్లలున్నారు. ఎలా బతకాలో తెలియడం లేదు. పిల్లల్ని పెంచడం భారంగా ఉందంటూ ఓ మహిళ బిక్షాటన చేసింది. అది కూడా ఆన్‌లైన్లో,  ఆమె అలా అడుక్కుంటూ ఉండగానే చాలామంది కరిగిపోయారు. ఆమెను ఓదార్చుతూ పెద్దమొత్తంలో చాలామంది డబ్బులు సాయం చేశారు. ఇలా ఆమె కేవలం 17 రోజుల్లోనే ఒకటి రెండు కాదు దాదాపు 50వేల డాలర్లు సంపాదించింది. అయితే ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది. ఆమె అలా అందర్నీ మోసం చేసిందని. ఈ ఘటన సౌదీలో చోటుచేసుకుంది.  ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. ఆమె పోస్టుల్లో ఉన్న చిన్న పిల్లలను గుర్తుపట్టిన బంధువులు భర్తకు విషయం చెప్పడంతో ఆ మాయలేడి గుట్టురట్టయింది. అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. భర్త వదిలేసిన విషయం వాస్తవమే అయినా, పిల్లలను ఆమె భర్తే చూసుకుంటున్నాడన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆ మహిళ ఆన్ లైన్ లో అందరినీ మోసం చేస్తోందని గుర్తించారు. సౌదీ చట్టాలు ప్రకారం సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే భిక్షాటన చేస్తే 2,50,000 నుంచి 50,000 దిరహమ్స్‌ వరకు జరిమానాగా విధిస్తారు.