తెలుగు అమ్మాయిని కావడం వల్లే.. ఎక్స్ పోజ్ చేస్తే తిడుతున్నారు: యాంకర్ అనసూయ

Being a Telugu girl .. If you pose Tidutunnaru : Anchor Anusuya

అనసూయ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది.. తనను టార్గెట్ చేస్తూ ఎన్ని ట్రోలింగ్స్ చేసినా.. డోన్ట్ కేర్ అంటోంది. ఎవరో ఏదో తిట్టారని, వర్గర్ కామెంట్స్ చేశారని బాధపడిన సందర్భాలు పోయాయని అన్నింటినీ తట్టుకుని స్ట్రాంగ్ లేడీగా నిలబడ్డానంటోంది.

అంతే కాదు.. పొట్టి బట్టలు వేసుకున్నాం అని ఎక్స్ పోజ్ చేస్తున్నామని నోటి కొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదంటూ 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ అత్యాచారాలు జరగుతున్నాయని వాళ్లు పొట్టి బట్టలు వేసుకోవడం కారణం కాదుగా అంటూ తనను ట్రోల్ చేసే వాళ్లకు హితబోధ చేస్తుంది అనసూయ.

నన్ను గతంలో ట్రోల్ చేశారు.. ఇప్పుడు కూడా చేస్తున్నారు.. నోటికొచ్చి బూతులు తిడుతున్నారు. ఇలాంటి వాటిని చాలా ఫేస్ చేశా. నేను తెలుగు అమ్మాయిని అయ్యి ఉండటం వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది నా అభిప్రాయం.

నాలా మోడరన్‌గా వేరే భాషవాళ్లు చేస్తే వహ్ వా అంటారు. వేరు భాషనుండి వచ్చిన వాళ్లను సొంగ కార్చుకుంటూ చూస్తారు. తెలుగు వాళ్లైతే.. మన వాళ్లా వద్దు అనేస్తారు. ఎవరైనా ఆడపిల్లలే అని గుర్తించాలి.

 

Be somebody who is very difficult to replace. 🤘🏻PC: @valmikiramu 🥰

Publiée par Anasuya Bharadwaj sur Dimanche 11 août 2019