50 కథల్లో ఒక్కటి నచ్చలేదా బెల్లంకొండ…?

Bellamkonda Srinivas Film Has Plenty Of Action To Give You The Thrills

తెలుగు నిర్మాతల కొడుకుల్లో హీరోలుగా రాణిస్తున్న ఈతరం హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. మంచి ఒడ్డు-పొడుగుతో, పర్లేదనిపించే డైలాగ్ డెలివరీ తో హీరో మెటీరియల్ అని తొలిసినిమా అల్లుడు శీను తోనే నిరూపించుకున్నాడు. ప్రముఖ దర్శకులతో సినిమాలు చేస్తూ, పేరున్న నటీమణులతో నటిస్తూ ఔరా అని కూడా అనిపించుకుంటున్నాడు. పెద్ద దర్శకులతో కాకుండా చిన్న దర్శకులతో చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. అందుకు ఉదాహరణలు స్పీడున్నోడు మరియు సాక్ష్యం.

kavacham-movie-event

బోయపాటి శ్రీను తో జతకట్టి చేసిన జయ జానకి నాయక సినిమా లాభాలు తెచ్చిపెట్టిందో లేదో తెలియదుగానీ హీరోగా మంచి మార్కులు మాత్రం వేయించింది.బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ‘కవచం’. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నిన్ననే హోటల్ దసపల్లా లో జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన కబుర్లు తెలుగు ప్రేక్షకులకి కాస్త అతిగా అనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకీ బెల్లంకొండ ఏమన్నాడంటే, తాను ఈ కవచం సినిమా చేయకముందు దాదాపుగా 50 వరకు కథలు విన్నాడని, అందులో ఏవి తనకి నచ్చలేదని, కానీ కవచం కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాడని చెప్పాడు. ఈ మాటలు విని ఏవేవో ఊహించుకున్న తెలుగు ప్రేక్షకజనం తీరా సినిమా టీజర్ చూశాక పెదవి విరుస్తున్నారు.

kavacham-movie-suresh

ఇంతకీ ఆ టీజర్ లో ఏమి చూపెట్టారో చెప్మా అంటే ఒక రొటీన్ పోలీస్ డ్రామా అనొచ్చు. పోలీస్ గా నటించడం బెల్లంకొండ శ్రీనివాస్ కి కొత్త అవ్వడం వలనేమో లేక ఆ మోజు కూడా తీర్చేసుకుందాం అన్నట్లుగా కవచం టీజర్ సాగిందే తప్ప చూడగానే కట్టిపడేసే అంశాలు ఒక్కటికూడా కనిపించలేదు. దీనికితోడు పరమ రొట్ట అనిపించే మాస్ డైలాగులు, ఏంటీ నస అనిపించే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.కవచం సినిమా విషయానికి వస్తే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ కవచం సినిమా ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ కథలకు ఎంత భిన్నంగా ఉంటుంది అనేది డిసెంబర్ వరకు వేచి చూస్తే తెలుస్తుంది.

kavacham