ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ గురవారం వెల్లడించాడు. కాగా స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు 81వ కెప్టెన్. ఇక వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీకు జో రూట్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. “బెన్ స్టోక్స్‌కు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు నేను పెద్దగా ఆలోచించలేదు. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టును విజయ పథంలో స్టోక్స్ నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది.
అదే విధంగా ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపట్టేందుకు అతడు అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంగ్లండ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అతడే సరైనోడు” అని రాబ్ కీ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఇక స్టోక్స్ 2013లో టెస్టుల్లో అరంగేట్రంచేశాడు. ఇప్పటి వరకు 73 టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్టోక్స్ ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన స్టోక్స్ 5,061 పరుగలతో పాటు.. 174 వికెట్లు పడగొట్టాడు.