అసలే వర్షాకాలం. మరోవైపు వైరస్.. బ్యాక్టీరియాలో దాడి చేయడానికి పొంచివున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా శరీరం ఎలాంటి అనారోగ్యాన్నైనా తట్టుకొనేలా ఉండాలి. శరీరానికి ఆ శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా బాదం పప్పులను రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు సైతం చెబుతున్నారు.
బాదంలో విటమిన్-ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోప్లోవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి.రోజుకు ఎన్ని తీసుకోవాలి.పెద్దవాళ్లు రోజుకు ఎనిమిది నుంచి పదికి బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి. పిల్లలు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులను తీసుకోవాలి. అయితే, బాదంను నేరుగా తినేయకుండా నీటిలో 7 నుంచి 8 గంటలు నానబెట్టి, తొక్క తీసి తినాలి. నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి. బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి. బాదం మొతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి. శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు. అతిగా బాదం తింటే శరీరంలో విషతుల్యాలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి.
బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది. దీని వల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి. విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది. డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినేవారిలో టైప్-2 డయాబెటీస్, మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ తదితర రసమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది.
దీని వల్ల మీ ఎముకలు బలోపేతమవుతాయి. విరిగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటాయి. బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం. ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది. డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయొచ్చు. బాదం తినేవారిలో టైప్-2 డయాబెటీస్, మెటాబాలిక్ (జీవక్రియ) సిండ్రోమ్ తదితర రసమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.బాదం పప్పులు నానబెట్టి తినాలా? ఉత్తివి తినాలా అనే సందిగ్దం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.అయితే, నానబెట్టి తినడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. అందుకే బాదం పప్పులను నానబెట్టి తొక్కను తీసేసి తినడం ఉత్తమం. పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన బాదంలోని లిపేజ్ అనే ఎంజైమ్ అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. బాదం తింటే త్వరగా ఆకలి వేయదు. నానబెట్టిన బాదంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.