బరువు తగ్గేందుకు వాడే ఈ మొక్క గురించి మీకు తెలుసా ?

Benefits of Spirulina for Weight Loss

నేటి ఫాస్ట్ ఫుడ్ యుగంలో అంతా ఫాస్ట్ గానే జరిగిపోతుంది. అలాగే బరువు పెరగడం కూడా ఇప్పుడు సాధారణ సమస్య అయిపొయింది. అందుకే ఇప్పుడు మనం బరువు తగ్గేందుకు సహాయ పడే ఒక మొక్క గురించి తెలుసుకుందాం. స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన నీటి మొక్క. దీన్ని భూమిపై మొక్కల ఆవిర్భావానికి తొలి రూపంగా భావిస్తారు. ఆదిమ మానవులు ఆహారంలో కూడా ఇది భాగంగా ఉండేదని చెబుతారు. చారిత్రకంగా వేల సంవత్సారాల నుంచి వాడుకలో ఉన్న ఈ నాచు మొక్క ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది.

ఇప్పటికీ అనేక దేశాల ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డారు. అలాంటి మొక్క బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. అదెలా అంటే ఈ మొక్క ఆకులను పొడి చేసి, నిత్యం కొద్ది మోతాదులో తీసుకుంటే ఇతర ఏ పోషకాహారం తీసుకోవాల్సిన పనిలేదు. తల్లిపాలలో ఉన్న పోషకాలు ఈ మొక్కలో ఉంటాయి. స్పిరులినా పొడిలో కాల్షియం సాధారణ పాలలో కన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల్లోకెల్లా అధికంగా ప్రోటీన్లు కలిగి ఉన్నది ఇదే. శాకాహారులు ఈ పొడిని తీసుకుంటే ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.