మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషక విలువలున్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన, పోషకవిలువలున్న ఆహారం.. తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, బీపీ లాంటి చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మీరు మంచి ఆహారం తీసుకుంటే రోజంతా యాక్టవ్‌గా ఉంటారు. మీకు మంచి నిద్ర కావాలన్నా.. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి… పడుకుంటే..నిద్ర పట్టేస్తుందిగా.. దీనికి మంచి ఆహారం తీసుకోవాలా.. అని ఆలోచిస్తున్నారా.. అవును నిద్రకు, ఆహారం మధ్య సంబంధం విడదీయలేనిది.
ఒకదానిలో లోపం జరిగినా.. మరొకదానిపై ప్రభావం పడుతుంది. నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది.. తిరిగి శక్తిని పుంజుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మీ ఆహారపు అలవాట్లు.. మీ నిద్ర క్వాలిటీని నిర్ణయిస్తాయి. మీకు మంచి నిద్ర పట్టడానికి.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, కొన్నింటిని కచ్చితంగా తీసుకోవాలి.. అవేంటో చూసేయండి మరి.
మెలటోనిస్ ఉత్పత్తి చేయడానికి.. సెరోటోనిస్ చాలా కీలకం. చక్కని నిద్రకు మెలటోనిస్ హార్మన్ కీలక పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ ఉన్న ఆహారం తీసుకుంటే.. నిద్ర బాగా పడుతుండి. ఇది మరీ ఎక్కువ తీసుకున్నా నిద్ర ఆటంకం కలుగుతుంది. ఓట్స్, నట్ల్, గుడ్లు, టోఫూ, సాల్మన్ చేపలు తింటే సెరోటోనిన్ మన శరీరానికి అందుతుంది. అమినో యాసిడ్ ఉన్న ఆహారాలు.. సెరోటోనిన్ ఉత్పత్తికి ఉపయోగాపడతాయి.
రాత్రిపూట మీ శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుంది. రాత్రి పిజ్జాలు, బంగాళాదుంప చిప్స్ లాంటివి తీసుకోకూడదు. ఈ ఆహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు మీ నిద్రను పాడు చేస్తాయి. మీకు పడుకునే ముందు ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే.. తర్వగా అరిగిపోయేవి తింటే మంచిది. పండ్లు తిన్నా చాలా మంచిది. ఇలా చేస్తే.. మీకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది.
అర్ధరాత్రి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ మీరు అతిగా తింటే.. అర్ధరాత్రి తినడం మీకు ముప్పు చేస్తుంది. ఒక వేళ మీ కడుపు ఖాళీగా ఉంటే.. మీరు ఎదైనా తినటమే మంచిది. ఆకలి కడుపుతో నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా మీకు నిద్ర పట్టదు. మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఫుల్‌గా కాకపోయినా.. ఏదైనా సులభంగా అరిగే స్నాక్ తీసుకోంది. మీకు చక్కగా నిద్రపడుతుంది.
ప్రత్యేకంగా షుగర్ ఉన్నవారు తగినంత ఆహారం తీసుకోకపోతే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువవుతాయి. వారి నిద్రకు భంగం కలిగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల.. మీకు పీడకలలు, విపరీతమైన చమట, చికాకుగా అనిపిస్తుంది.
చాలామంది తినగానే బెడ్ ఎక్కేస్తారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అంత సులభంగా జీర్ణం కాదు. పొట్ట భారంగా మారి ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఛాతిలో మంటగానూ ఉండొచ్చు. కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. సరిగా నిద్ర పట్టదు. కాబట్టి నిద్రపోవడానికి కనీసం ముూడు గంటల ముందు ఆహారం తీసుకోవడం ఉత్తమం. తిన్న తర్వాత కొంత సేపు నడవండి.
పగటిపూట ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే నీరు తాగాల్సిందే. అయితే రాత్రులు ఈ విధానం వద్దు. రాత్రి 8 గంటల తర్వాత తక్కువ నీరు తాగడమే మంచిది. ఎక్కువగా తాగడం వల్ల అర్ధరాత్రి అస్తమానం టాయిలెట్‌కు వెళ్లాల్సి రావొచ్చు. దీంతో చక్కటి నిద్రకు బ్రేక్ పడుతుంది. ఈ సమస్యలు రావొద్దంటే రాత్రిపూట నీరు తక్కువగా తాగండి.
చాలా మంది పగటిపూట టీ, కాఫీ తాగుతుంటారు. దీంతో ఇబ్బంది లేదు కాని.., కొంతమంది రాత్రి పడుకునేముందు టీ, కాఫీ తాగడం ఇష్టం. రాత్రుళ్లు ఉద్యోగాలు చేసేవారైతే.. తప్పదు అనుకోవచ్చు. మరికొంతమంది చాక్లెట్లు తింటుంటారు. ఈ అలవాట్లు మంచివి కావు. టీ, కాఫీ, చాక్లెట్లలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రకు సంబంధించి అనేక సమస్యలకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత.. పడుకునే ముందు వీటిని తీసుకోవద్దు.
నిద్రపోయే ముందు.. చాలా మంది ఐస్‌క్రీమ్‌లు, కుకీలు, చాక్లెట్లు తింటుంటారు. ఆ టైమ్‌లో ఇవి తినడం వల్ల చాలా ప్రమాం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరడగం లేదా, తగ్గడం జరుగుతుంది. ఐస్‌క్రీమ్, కుకీల్లోల ఫైబర్ తక్కువగా చక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ నిద్రకు ఆంతరాయం కలిగిస్తాయి. రాత్రి భోజనంలో కోసం బీన్స్, క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రౌన్ రైస్, క్వినోవా , కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఇవి తినడం వల్ల మీకు మంచి నిద్రపడుతుంది. రాత్రుళ్లు ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎక్కువ ఆహారం తింటే ఉబ్బసంతో కడుపు ఇబ్బంది పెడుతుంది. దీంతో నిద్ర సరిగా పట్టదు. అందుకే, పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.