టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఘనతను సాధించింది. ఎఫ్‌సి డిస్రప్టర్స్-2021 జాబితాలో బెస్ట్‌గా నిలిచింది. ఎఫ్‌సీ 2021 టాప్ 20 లిస్ట్‌లో సమంత 8వ స్థానంలో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది. నటుడు రాహుల్ రవీంద్రన్, సుమన్ లాంటి సెలబ్రిటీలతోపాటు, ఆప్ నేత, న్యాయవాది సోమనాథ్ భారతి కూడా సమంతాను అభినందిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇప్పటికే ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2021లో సమంత బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డును ది ఫ్యామిలీ మ్యాన్-2కి అందుకుంది. తాజాగా ఫిల్మ్ ఛాంపియన్ డిస్రప్టర్స్- 2021లో టాప్-20లో సమంత స్థానం సంపాదించుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంపియన్ ఎఫ్‌సీ డిస్రప్టర్స్ 2021 జాబితాలో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి 20 లిస్ట్ లో టాప్ 3 లో నిలిచాడు. దీంతో సమంతాతోపాటు, టాలీవుడ్ నుండి ఇద్దరు స్టార్స్ స్థానం సంపాదింకున్నట్టయింది. ఇక ఈ లిస్ట్‌లో ఓటీటీ సూపర్‌స్టార్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు. సమంతతోపాటు నటి నిమిషా సజయన్, మహిళా డైరెక్టర్లు పాయల్ కపాడియా, గునీత్‌మోంగా కూడా టాప్ 20లో నిలిచారు.
కాగా ఇదే సిరీస్గాను ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 అవార్డును కూడా సమంత కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంతకు ఉత్తమ నటిగా, మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెల్చుకున్నారు. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టి పడేసింది. రంగస్థలం, యు టర్న్ , సూపర్ డీలక్స్ చిత్రాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత హిందీలోకి అరంగేట్రం చేయడం,ఆ సిరీస్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో నేషనల్ స్టార్‌గా మారిపోయింది. మరోవైపు హీరోల ఆధిపత్యమే ఎక్కువగా సాగే తెలుగు సినీ పరిశ్రమలో, సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న పాన్-ఇండియన్ పౌరాణిక మూవీ శాకుంతలంలో నటిస్తోంది.