ఊపిరితిత్తుల ఆరోగ్య ప్రాధాన్యత

ఊపిరితిత్తుల ఆరోగ్య ప్రాధాన్యత

యోగా.. ప్రపంచానికి ఇండియా అందించిన విలువైన వరం. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా వేద‌కాలం నుంచే భార‌త‌దేశంలో అమల్లో ఉంది. 1863-1902 కాలంలో స్వామి వివేకానంద పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేశారు.ముందుగా నిటారుగా నిలబడి సూర్యనమస్కారం చేసినట్లు చేతులతో నమస్కరించాలి.తరువాత నేలకు తగలకుండా కూర్చొని మన పాదాలను పూర్తిగా సమానంగా నేలకి తగిలేలా ఫ్లాట్గా ఉండాలి.

రెండు మోచేతులు రెండు మోకాళ్లను తగులుతూ ఉండగా అలాగే ఉండి నమస్కరించాలి.యోగా చేసేటప్పుడు కచ్చితంగా ఈ ఆసనం చేస్తే చాలా మంచిది.ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాలుష్యం అనేక శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది లేదా ఇప్పటికే ఉన్న కొన్ని సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మీ ఊపిరితిత్తులను బలోపేతం చేసుకోవడం చాలా సులభం అని , ఆధ్యాత్మిక గురువు, జీవనశైలి కోచ్, యోగా-వ్యాపారవేత్త, రచయిత గ్రాండ్ మాస్టర్ అక్షర్ తెలిపారు.

ముందుగా సమానంగా వీపు నెలకానెల పడుకోవాలి.మెల్లగా మోకాళ్లను పైకి లేపడానికి ట్రై చేయాలి.ఆ తర్వాత అర చేతులను అలాగే ఉంచి,తర్వాత మన శరీరం మొత్తం పైకి లేపాలి కేవలం అరచేతులు మాత్రమే నేలపై ఉండేలా చూసుకోవాలి.మెడను అలాగే ఉంచి రిలాక్స్ అవ్వాలి.మన రోజువారీ అలవాట్లలో – పుష్కలంగా నీరు త్రాగడం, పోషకమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా చేయడం వంటివి చేయడం చాల మంచిది. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ చేయడం మంచిది.. మొదటిసారి చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది.

ముందుగా మీ అర చేతి నుండి మోచేయి వరకూ రెండు చేతులు నేల మీద ఉంచాలి.తరువాత మెల్లగా అరచేతుల్ని దగ్గరగా చేసి మోచేతిని v ఆకారంలో కి మార్చాలి.మెల్లగా కాళ్ళను పైకి లేపడానికి ట్రై చేయాలి.అలా శరీరం మొత్తం నిటారుగా పైకి లేపి కాళ్లను ముఖం వైపు తీసుకురావాలి.కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ నిటారుగా చూస్తూ 30 సెకండ్లు ఉండడానికి ట్రై చేయాలి.

ఆహారాన్ని తీసుకున్న తర్వాత యోగా అస్సలు చేయకూడదు. అందుకే, ఎక్కువ మంది ఉదయాన్నే లేచి పరగడపున యోగా చేస్తారు. ఒక వేళ మీరు ఆహారం తీసుకున్నట్లయితే.. రెండు గంటల తర్వాతే యోగాసనాలు వేయాలి. తిన్న వెంటనే యోగా చేస్తే జీర్ణ సమస్య ఏర్పడతాయి. ఆకలిగా ఉన్నటయితే.. చిన్న పండు తిని, అరగంట తర్వాతైన యోగా చేయొచ్చు. ఆసనాలకు ఓ అరగంట ముందు చిన్న గ్లాసు నీరు తాగొచ్చు. యోగా చేస్తున్న సమయంలో దాహం వేస్తే మధ్య మధ్యలో కొంత నీరు తాగొచ్చు.

ముందుగా కింద కూర్చోవాలి తర్వాత మెల్లగా రెండు కాళ్లను విడదీసి మన పాదాలు అంటుకునే లాగా మఠం వేసుకోవాలి.కొంచెం గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి అలా కూర్చున్న తర్వాత మన రెండు చేతులతో మన రెండు పాదాలను పట్టుకోవాలిఈ ఆసనాన్ని వేసేటప్పుడు నిటారుగా కూర్చోవడం చాలా ముఖ్యం.ఇటువంటి ఆసనాన్ని కచ్చితంగా 30 seconds చేయడం మంచిది.

వ్యాయమం చేయడానికి ముందు వార్మప్ చేసినట్లే.. యోగాను కూడా నెమ్మదిగా మొదలుపెట్టాలి. శ్వాస ప్రక్రియలు.. అంటే గాలిని లోపలికి పీల్చుతూ బయటకు వదలడం, ప్రాణాయామంతో యోగాను ఆరంభించాలి. దీని వల్ల మీరు ఎక్కువ సేపు యోగా చేయొచ్చు. ప్రాణాయామంలో శ్వాసపై ధ్యాస పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆసనాలన్నీ అలుపు లేకుండా చురుగ్గా చేయొచ్చు. మీరు యోగా చేసే ప్రాంతం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. నిశబ్దమైన ప్రదేశంలో యోగా చేయడం మంచిది.