జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా

జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఇలా బాధపడడానికి మేయిన్ రీజన్ పొల్యూషన్ అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల షాంపూలు వాడినా కూడా జుట్టు సమస్యలు వస్తుండడంతో ఏం చేయాలో తెలియక అనేక టెన్షన్స్ పడుతున్నారు.

మనుషుల కలర్స్ లాగే జుట్టు కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతే కాకుండా మనం వాడుతున్న షాంపూలు మన జుట్టుకు పడుతున్నాయా? లేదా అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైనా కొత్త షాంపూలను వాడాలని అనుకున్నపుడు మన డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం.

ఎలాంటి బద్దకస్తులయినా సరే వారానికి ఒకసారైనా తల స్నానం తప్పకుండా చేస్తారు. తల స్నానం చేసేటపుడు తప్పనిసరిగా షాంపూని వాడతారు. ఎటువంటి షాంపూని వాడడం వలన మనకు జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయో అనే విషయంలో కొందరు అనేక రకాల తప్పులు చేస్తారని ప్రముఖ డెర్మటాలజిస్ట్ పేర్కొన్నారు. మనలో కొంత మందికి డెలికేట్ హెయిర్ ఉంటుంది. మరికొంత మంది హెయిర్ మాత్రం ఎలా చూసుకున్నా సరిగా ఉంటుంది.

డెలికేట్ హెయిర్ ఉన్న వారు తమ జుట్టును సంరక్షించుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డెలికేట్ హెయిర్ ఉన్న వారు స్ట్రాంగ్ హెయిర్ ఉన్న వారితో కంపేయిర్ చేసుకుంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన జుట్టును జాగ్రత్తగా చూసుకోవడంలో మనం వాడే షాంపూ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. కావున షాంపూ చేసుకునేటపుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ విధంగా షాంపూ చేసుకోవడం వలన మన జుట్టు అనేది ప్రాబ్లమ్స్‌కి గురికాకుండా ఉంటుందనే విషయాలను తెలుసుకోవాలి.

కొంత మందికి ఎటువంటి షాంపూలు వాడినా కూడా జుట్టు సమస్యలు వస్తుంటాయి. అటువంటి వారు షాంపూలను తరుచూ మారుస్తూ విసిగిపోతారు. కేవలం బ్రాండెడ్ షాంపూలను వాడడం మాత్రమే కాకుండా వాటిని వాడేటప్పుడు తగుజాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

షాంపూ అనేది కేవలం మన తలను శుభ్రం చేసేందుకే ఉందని తెలుసుకోవాలి. అంతేకానీ ఇది మన జుట్టు తంతువులను శుభ్రం చేయదనే విషయం తెలుసుకోవాలి. షాంపూను బట్టి మన తల మీద 30 సెకన్ల సమయం పాటు మసాజ్ చేసుకోవాలి. షాంపూ ఉత్పత్తులను బట్టి సమయం అనేది మారుతూ ఉంటుంది. మనం షాంపూ చేసినపుడు ఎక్కువగా నురగ రావడం కోసం మన జుట్టును తడిగా ఉంచుకోవడం అవసరం. జుట్టు తడిగా ఉంటే షాంపూ నురగ ఎక్కువగా వస్తుంది.

కొంత మంది జుట్టుకు షాంపూ చేసేటపుడు చాలా ఎక్కువ పరిమాణంలో షాంపూని వాడతారు. అలా చేయడం మంచిది కాదు. షాంపూని చాలా తక్కువగా వాడాలి. జుట్టు పొడవుగా ఉందని కొందరు, ఎక్కువగా ఉందని కొందరు, జుట్టు ఒత్తుగా ఉందని కొందరు రకరకాల కారణాలు చెప్పి అధికంగా షాంపూని జుట్టుకు అప్లై చేస్తారు. ఇలా అధికంగా షాంపూని అప్లై చేయడం వలన మనకు జుట్టు సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

ఇది మాత్రమే కాకుండా కొంత మంది షాంపూ చేసేటపుడు సరిగ్గా కడగరు. ఏదో పైపైన కడిగి స్నానం ముగించేస్తారు. షాంపూ చేసినపుడు తప్పనిసరిగా మన జుట్టుకు అంటుకున్న షాంపూను కుదుళ్ల నుంచి పర్ఫెక్ట్ గా కడగాలి. ఇలా పర్ఫెక్ట్ గా కడిగినపుడే షాంపూ వలన మన జుట్టుకు సమస్యలు రాకుండా ఉంటాయి. లేదంటే మన జుట్టు పొడి బారి పోతుంది. మీ జుట్టు ఎంత పొడవుగా ఉన్నా సరే కాయిన్ సైజంత షాంపూ జుట్టుకు కరెక్ట్గా సరిపోతుంది.

షాంపూ చేసిన తర్వాత చాలా మంది హెయిర్ను సరిగ్గా తుడవరు. ( ఆరబెట్టడం ). మనం షాంపూ చేసిన తర్వాత హెయిర్ను తుడవడం చాలా ముఖ్యం. మన జుట్టును సరిగ్గా క్లీన్ చేసుకోవడంతో పాటు సరిగ్గా తుడిస్తేనే మంచిది. తుడిచే ముందు కూడా ఏ బట్టతో పడితే దానితో జుట్టును తుడవకుండా కేవలం కాటన్ టవల్ కానీ కాటన్ టీ షర్ట్ ను కానీ వాడాలి. అలా తుడిస్తే మన జుట్టు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

ఎన్ని రోజులకోసారి షాంపూని వాడుతున్నారనేది మరో ముఖ్య విషయం. మనలో చాలా మంది వారానికి రెండుసార్లు షాంపూ చేసుకుంటే సరిపోతుందని భావించి అలానే చేస్తారు. కానీ అలా చేయడం అంత మంచిది కాదు. షాంపూ వాడే ఫ్రీక్వెన్సీ ఒక్కోరికి ఒక్కోలా ఉంటుంది. కావున మన జుట్టుకు ఏ విధంగా షాంపూ అవసరమవుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. కొందరికి వారానికి రెండుసార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. కొంత మందికి వారానికి ఒకసారి మాత్రమే సరిపోతుంది. కానీ కొంత మందికి ప్రతి రోజు షాంపూ అవసరమవుతుంది.

మన జుట్టు ఎలాంటి విధానంలో ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుని మనం మసులుకోవాలి. ప్రతి రోజు షాంపూను వాడాల్సి వచ్చిన వారు మైల్డ్ షాంపూలను వాడుకోవడం ఉత్తమం. కొంత మందికి రెగ్యులర్గా షాంపూ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ వారు తమ జుట్టు పెరుగుదల కోసం తమ ఫ్రీక్వెన్సీ నెమ్మదిగా పెంచుకోవాలి. ఇలా మనం షాంపూ చేసుకున్నా కానీ ఏ విధమైన జుట్టు సమస్యలు తలెత్తినా కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం. నిపుణులకైతే జుట్టు సమస్యల గురించి పర్ఫెక్ట్గా తెలుస్తుంది.

ప్రపంచంలో అన్ని రకాల హెయిర్ ఉన్న వారికి ఉత్తమంగా పని చేసే షాంపూ ఏదీ లేదనే విషయాన్ని గ్రహించాలి. ఒక బ్రాండ్ షాంపూ ఒకరికి సూటయితే వేరొకరికి సూట్ కాకపోవచ్చు. అంత మాత్రాన ఆ షాంపూ మంచిది కాదని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఒక్కో రకమైన హెయిర్ ఉన్న వారికి ఒక్కో రకమైన షాంపూ ఉత్తమంగా పని చేస్తుంది. కాబట్టి మనం షాంపూను ఎంచుకునే ముందు మన జుట్టుకు ఏదైతే సరిగ్గా సరిపోతుందో అదే రకం ఎంచుకోవాలి.

అలా కాకుండా ఏవి పడితే ఆ షాంపూలు వాడితే మనకు జుట్టు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ జుట్టుకు ఎటువంటి షాంపూ సరిగ్గా సరిపోతుందనే విషయంలో డెర్మటాలజిస్ట్లు ఖచ్చితమైన ఒపీనియన్ చెబుతారు. కావున మన సమస్యల గురించి, ఎటువంటి షాంపూ వాడాలనే వివరాల గురించి డెర్మటాలజిస్ట్ లను సంప్రదించడం ఉత్తమం. కొంత మంది జుట్టు సిల్కీగా ఉండవచ్చు, కొంత మందిది ఆయిలీగా ఉండవచ్చు. అందువలన మనం కరెక్ట్ షాంపూను ఎంచుకోవడం చాలా అవసరం.

సరైన విధంగా షాంపూ చేశాక జుట్టు సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన పద్ధతిలో జుట్టును ఆరబెట్టడం కూడా అవసరమే. మనం జుట్టును ఆరబెట్టడంలో ఏముందిలే అని అనుకుంటాం. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కావున సరైన పద్ధతుల్లో జుట్టును ఆరబెట్టుకోవడం చాలా అవసరం. మనలో చాలా మంది షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు బిగుతుగా ఉండేలా ఒక బట్టను కడతారు. అలాగే ఉంచి బట్టను కొద్ది సమయం తర్వాత రిలీవ్ చేస్తారు.

కానీ ఇలా క్లాత్తో కట్టి ఉంచడం వలన జుట్టు పొడిబారి రాలిపోతుంది. కావున జుట్టును క్లాత్తో గట్టిగా కట్టడం మానుకోవాలి. మనం షాంపూ చేసిన తర్వాత జుట్టును కేవలం తెలుపు రంగు కాటన్ టవల్, కాటన్ టీ షర్ట్తో తుడుచుకోవాలి. ఇలా జుట్టును తుడుచుకునేందుకు కాటన్ క్లాత్ ను వాడడం వలన మన జుట్టు ఎటువంటి డ్యామేజ్కు గురి కాకుండా ఉంటుంది. కాబట్టి జుట్టును షాంపూ చేయడం మాత్రమే కాదు ఆరబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.