ఒంట్లో ఉండే చెడు పదార్థాలని బయటకు తొలగించడానికి నీళ్ళు చాలా అవసరం. అలానే పోషక పదార్థాలను తీసుకెళ్లడానికి మరియు ఆక్సిజన్‌ని సెల్స్‌కి అందించడానికి కూడా నీళ్లు అవసరం. అలానే నీళ్లు సరిగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే ఎముకల్ని కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి నీళ్లు సహాయ పడతాయి.చాలా మంది పెద్ద వాళ్ళు నుంచుని నీళ్లు తాగద్దు అంటారు.అయితే నిజంగా నీళ్లు నిలబడి తాగకూడదు. తాగితే తప్పక ఇబ్బందులు వస్తాయి.
అయితే ఏ ఇబ్బందులు వస్తాయి అనేది చూస్తే…. ఎప్పుడూ కూడా నిల్చుని నీళ్లు తాగకూడదు. గబగబా నించుని కనుక మీరు నీళ్లు తాగుతున్నారు అంటే మిమ్మల్ని మీరు రిస్క్ లో పెట్టినట్టే. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మంచి నీళ్లు నిలబడి తాగడం వల్ల ఏమవుతుంది అనే విషయంలోకి వెళితే… నిల్చుని నీళ్లు తాగడం వల్ల ఆ నీళ్ళు తిన్నగా లోపలికి వెళ్లి పోతాయి. బాడీ లోపలికి మొత్తం వెళ్ళి పోయి కొలెన్ దగ్గరికి చేరిపోతాయి. అదే ఒకవేళ నెమ్మదిగా కూర్చుని నీళ్ళని తాగడం వల్ల అన్ని శరీర భాగాలకు కూడా నీళ్లు వెళ్తాయి.
దీంతో నీళ్లు తన పనిని అది చేస్తుంది దీని కారణంగా చెడు మలినాలు ఒంట్లో నుండి బయటకు వెళ్లడం, దాహం తీరడం ఇలా అవసరమయ్యే పనులు పూర్తి అయిపోతాయి. అంతే కానీ మీరు నించుని గబగబా నీళ్లు తాగితే తిన్నగా లోపలికి వెళ్లి పోతాయి దీంతో దాని పని అది చేసుకో లేదు కూడా. మీకు కనుక ఎక్కువగా నిల్చుని నీళ్లు తాగే అలవాటు ఉంటే అప్పుడు ఈ అలవాటు నుంచి బయట పడడం కూడా మంచిది. ఎందుకంటే దీనివల్ల సమస్య కానీ ఉపయోగం ఉండదు. చూశారు కదా ఆయుర్వేద నిపుణులు మనతో ఎన్నో ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు తప్పకుండా అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అలానే జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అయితే చాలా మంది తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అందుకని అలా తప్పులు చేయకుండా నీళ్ళని మంచిగా తీసుకుంటే బాగుంటుంది. అయితే ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలకి దూరంగా ఉండచ్చు అనేది చూద్దాం.ఎప్పుడూ కూడా గ్లాసుడు నీళ్ళు గబగబ తాగకండి. నెమ్మదిగా షిప్ చేస్తూ నీళ్లని తాగండి. కానీ చాలా మంది వేగంగా నీళ్ళని తాగుతూ ఉంటారు. కానీ అది నిజంగా తప్పు. ఆ అలవాటు ఉంటే మానుకోవాలి.రెండవది ఆహారం తీసుకునే ముందు కానీ ఆహారం తీసుకున్న తర్వాత కానీ వెంటనే నీళ్లు ఎక్కువగా తీసుకోకండి.ఇది గ్యాస్ జ్యూస్స్‌ని డైల్యూట్ చేసేస్తుంది.
దీనితో జీర్ణమవడం కష్టమవుతుంది.అలాగే పోషక పదార్థాలను కూడా సరిగా తీసుకోలేము.మీకు కనుక దాహం వేస్తే ఆహారానికి తీసుకోడానికి అర గంట ముందు మీరు నీళ్లు తీసుకోవాలి లేదు అంటే నీళ్లు తీసుకున్న అర గంట వరకు ఆహారం తీసుకోకుండా ఆగండి.ఒకవేళ కనుక మీరు ఆహారం తీసుకునేటప్పుడు నోరు ఎండిపోయినా, దాహం వేసినా గ్లాసుడు నీళ్లు తాగకుండా ఒకటి లేదా రెండు గుక్కలు నీళ్లు తీసుకోండి.తీసుకున్న ఆహారం బాగా తిరగాలి అంటే గోరు వెచ్చని నీళ్లు తీసుకుంటే మీకు సహాయపడుతుంది. చల్లటి నీళ్లు కంటే కూడా గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉండొచ్చు.
కాబట్టి నీళ్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. అలాగే చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు.అలానే అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం లేదు అంటే ఆహారం తీసుకునే మధ్య లో నీళ్లు తీసుకోవడం లాంటివి చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు.దీనితో తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కూడా అవ్వక పోవచ్చు అని ఆయుర్వేద అంటోంది.నీళ్లు తీసుకోవడం వల్ల అది కూలెంట్‌గా పని చేస్తుంది. అలానే మంటను అది చల్లార్చి చల్లగా ఉంచుతుంది.
అయితే అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబెసిటీ సమస్య కూడా వస్తుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ఆయుర్వేదం ప్రకారం ఈరోజు నీళ్ళు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు. ఏ సమస్యల నుండి బయట పడవచ్చు అనేది చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఆయుర్వేద నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా శరీరానికి తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం అని అంటున్నారు.
అయితే ఈ తప్పులు కనుక ఒక వేళ మీరు చేస్తున్నారంటే తప్పకుండా వాటిని ఆపేయాలి లేదు అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆయుర్వేదం ప్రకారం సరిగ్గా నీళ్లు తీసుకోక పోవడం వల్ల సమస్యలు వస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు అయితే తప్పవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సరిగ్గా నీళ్లు తీసుకోక పోతే అది జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.