వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్’ చిత్రం దారుణమైన ఫ్లాప్‌ను చవిచూసింది. నాగార్జునకు చాలా ఆశలు రేపిన వర్మ ఆయన్ను నిండా ముంచేశాడు. శివ వంటి సినిమాను తీస్తున్నాను అంటూ చెప్పిన వర్మ చెత్త సినిమా తీశాడు. ‘ఆఫీసర్’ చిత్రంకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి విడుద చేసి వర్మ తీవ్రంగా నష్టపోయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పుడు వర్మ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకోకుండా కేవలం నిర్మాతగా వ్యవహరించాడు. కొత్త వారితో వర్మ నిర్మించిన ‘భైరవగీత’ చిత్రం టీజర్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వర్మ ఎన్ని ఫ్లాప్ చిత్రాలు చేసినా, నిర్మించినా కూడా ఆయన సినిమా అనగానే అందరిలో ఒక అటెన్షన్ ఏర్పడుతుంది. ఇన్ని రోజులు మీడియాలో కనిపించని వర్మ తాజాగా ఈ చిత్రంను ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని సిద్దార్థ అనే కొత్త దర్శకుడితో వర్మ నిర్మించాడు. ఈ చిత్రం టీజర్‌ను రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. సైలెంగ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడిగా సక్సెస్ కాలేక పోతున్న వర్మకు కనీసం నిర్మాతగా అయిన సక్సెస్ దక్కుతుందా అనేది చూడాలి.