సెన్సార్ పూర్తి చేసుకున్న “భలే ఉన్నాడే” మూవీ …. !

"Bhale Unnade" movie that has been censored....!
"Bhale Unnade" movie that has been censored....!

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు జే. శివసాయి వర్ధన్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ భలే ఉన్నాడే. సెప్టెంబర్ 13, 2024న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది . ఇప్పటికే రిలీజైన టీజర్ మరియు ట్రైలర్ మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

"Bhale Unnade" movie that has been censored....!
“Bhale Unnade” movie that has been censored….!

ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని రవి కిరణ్ ఆర్ట్స్ మరియు మారుతి టీమ్ లు నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ తో రాజ్ తరుణ్ హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.