‘భరత్‌ అనే నేను’ సెన్సార్‌ రిపోర్ట్‌

Bharat Ane Nenu movie Censor Report

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ‘శ్రీమంతుడు’ తర్వాత రాబోతున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిగా చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ వారంలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే ఈ చిత్రంలో ఒక్క కట్‌ కూడా చెప్పకుండా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది.

ఈమద్య కాలంలో కట్స్‌ లేకుండా సర్టిఫికెట్‌ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక్క కట్‌ కూడా సెన్సార్‌ వారు చెప్పకుండా ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు సైతం నమ్మకంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలిసి ఏకంగా 2000 స్క్రీన్స్‌లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈనెల 20న విడుదల కానున్న ‘భరత్‌ అనే నేను’ మహేష్‌ కెరీర్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.