వారిపై శ్రీ కేసు పెట్టక పోవడానికి కారణం ఏంటీ?

Why is not the Sri reddy case filed against them?

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్‌ కౌచ్‌ ఉద్యమంపై స్టార్స్‌ కూడా రెస్పాండ్‌ అయ్యే వరకు వెళ్లింది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ ఈ విషయమై స్పందించిన విషయం తెల్సిందే. మీడియాలో చర్చ కార్యక్రమాలు పెడితే న్యాయం జరగదని, చట్టపరంగా వెళ్లాలంటూ శ్రీరెడ్డికి సూచించాడు. పవన్‌ కళ్యాణ్‌ సూచన మేరకు శ్రీరెడ్డి తాజాగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ శ్రీరెడ్డి టీవీ కార్యక్రమంలో తనపై చేయి చేసుకున్న కరాటే కళ్యాణిపై మరో జూనియర్‌ ఆర్టిస్టుపై మాత్రమే కేసు పెట్టింది. వారిద్దరిపై కూడా వ్యక్తిగత దూషణల కేసు మాత్రమే పెట్టింది. పువురు స్టార్స్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి, తన జీవితాన్ని నాశనం చేశారంటే ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియాలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో నాని, శేఖర్‌ కమ్ముల, అభిరామ్‌, వైవా హర్ష, శ్రీరామ చంద్ర, శివాజీ రాజా, కొరటాల శివలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఈ అమ్మడు పోలీసులకు మాత్రం వారిపై ఫిర్యాదు చేయలేదు. వారు తనను మోసం చేశారంటూ సాక్ష్యాలు కూడా చూపుతున్న శ్రీరెడ్డి ఎందుకు వారిపై కేసు పెట్టలేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకు శ్రీరెడ్డి వారిపై కేసు నమోదు చేస్తే ఎంతకైనా తెగిస్తారనని, నాకు ప్రాణ భయం ఉందని సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా సమాచారం అందుతుంది. సమయం వచ్చినప్పుడు వారందరిపై కూడా కేసు పెడతాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. తనపై అవాకులు చెవాకులు పేళుతున్న వారిపై మొదట కేసు పెట్టినట్లుగా ఆమె పేర్కొంది. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమంను చాలా మంది స్వాగతిస్తున్నారు. మరి కొందరు మాత్రం శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం ఉద్యమం చేస్తుందని ఆరోపిస్తున్నారు.