సినిమాల్లోకి రావాలనుందట, సాధ్యమేనా?

Disco Shanthi wants to Re-entry in Movies

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1980లలో ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టిన డిస్కో శాంతి నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయిన విషయం తెల్సిందే. శ్రీహరి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే అనారోగ్యంతో చనిపోయారు. శ్రీహరి చనిపోయాక చాలా కాలం పాటు డిస్కో శాంతి మామూలు మనిషి కాలేక పోయారు. పిల్లలు పెద్ద వారు అవ్వడంతో పాటు, వారి బాగోగులు వారు చూసుకుంటూ, చదువుకుంటూ ఉన్న నేపథ్యంలో డిస్కో శాంతి మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని తన కోరికను ఇంటర్వ్యూ ద్వారా వెళ్లడి చేసిన డిస్కో శాంతికి అవకాశాలు వచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నా చితకా పాత్రల్లో, గుంపులో గోవింద అన్నట్లుగా ఉండే పాత్రలను తాను చేయదల్చుకోవడం లేదు అంటూ చెప్పడంతో డిస్కో శాంతికి కీలక పాత్రలే చేయాలని ఉందని తేలిపోయింది. అలాంటి పాత్రలకు ప్రస్తుతం నిన్నటి తరం హీరోయిన్స్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే డిస్కో శాంతి అనుకున్నది నెరవేరే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి భార్యగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉన్న డిస్కో శాంతికి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. అయితే చిన్నా చితకా సినిమాల్లో మాత్రం ఆమెకు ఛాన్స్‌ వస్తే రావచ్చు అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.