తమన్నా క్లారిటీ ఇచ్చేసింది

tamanna-clarity-on-sye-raa-

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇదే చిత్రంలో ఒక కీలక పాత్రలో తమన్నా నటిస్తున్నట్లుగా గత మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా తమన్నా షూటింగ్‌లో కూడా పాల్గొంటుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను నమ్మలేం అంటూ కొట్టి పారేశారు. కాని తాజాగా తమన్నా ఆ వార్తలు నిజమే అంటూ తేల్చి చెప్పింది.

‘బాహుబలి’ చిత్రం తర్వాత తమన్నాకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశమే దక్కలేదు. చిన్నా చితకా చిత్రాల్లో చేసినా కూడా అవి సక్సెస్‌ను దక్కించుకోలేదు. దాంతో తమన్నా కెరీర్‌ ఖతం అని అంతా భావించారు. కాని అనూహ్యంగా తమన్నాకు మెగా ఆఫర్‌ దక్కింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఆమె క్లారిటీ ఇచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి, మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కలిసి నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమన్నా తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తమన్నా ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.