‘మహానటి’లో కూడా మంచి..!

samantha role in mahanati movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో దాదాపు దశాబ్దం కాలంగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సమంత తాజాగా ‘రంగస్థలం’ చిత్రంతో నటిగా నిరూపించుకుంది. కెరీర్‌ ప్రారంభించినప్పటి నుండి ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలను సమంత చేసింది. ‘రంగస్థలం’లో అద్బుతమైన నటనతో, పక్కా పల్లెటూరు పాత తరం అమ్మాయిగా నటించి మెప్పించింది. రంగస్థలం చిత్రం తర్వాత సమంత ‘మహానటి’ చిత్రంతో మధురవాణిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న మహానటి చిత్రం వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్దం అవుతుంది.

‘రంగస్థలం’ చిత్రంతో నటిగా నిరూపించుకున్న సమంత ‘మహానటి’లో కూడా తన నట విశ్వరూపంను చూపనున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. సమంత కెరీర్‌లో ఇది కూడా ఒక బెస్ట్‌ పాత్ర అవుతుందనే నమ్మకంతో వారు ఉన్నారు. 1970 కాలంలో సమంత మధురవాణిగా కనిపించబోతుంది. సావిత్రికి మధురవాణికి ఉన్న సంబంధం ఏంటా అని ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న గుసగుసల ప్రకారం కీర్తి సురేష్‌ పాత్ర కంటే కూడా సమంత పాత్రకు ఎక్కువ బలం ఉంటుందని, సినిమాలో ఎక్కువ శాతం సమంత కనిపిస్తుందని చెబుతున్నారు. దాంతో సమంతకు మళ్లీ మంచి పాత్ర దక్కినట్లే అని అంటున్నారు. పెళ్లి తర్వాత సమంతకు వరుసగా భారీ చిత్రాల్లో ఆఫర్‌ వస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్‌ మరియు అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు