Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించింది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. ఓవర్సీస్లో ‘శ్రీమంతుడు’ రికార్డును కేవలం రెండవ రోజే బ్రేక్ చేయడంతో అంతా కూడా షాక్ అయ్యారు. కేవలం ఒక్క రోజుల్లోనే 2.5 మిలియన్ డాలర్లను అమెరికాలో రామ్ చరణ్ రంగస్థలం చిత్రంతో వసూళ్లు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు భరత్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఓవర్సీస్లో మహేష్‌బాబుకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తో మహేష్‌బాబు ఫ్లాప్ చిత్రాలు కూడా అక్కడ భారీ వసూళ్లు రాబట్టాయి. టాప్‌లో మహేష్‌బాబు పలు చిత్రాలు ఉన్నాయి. అయితే రంగస్థలం చిత్రం తాజాగా రికార్డు బద్దలు కొట్టిన నేపథ్యంలో మహేష్‌బాబు ఫ్యాన్స్ భరత్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అమెరికాలో భరత్ అనే నేను చిత్రం మొదటి వారంలోనే 5 మిలియన్ డాలర్లను వసూళ్లు చేయాలనే ఉద్దేశ్యంతో భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. అమెరికాలో లెక్కకు మించిన స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా కైరా అద్వానీ నటించిన విషయం తెల్సిందే. ఈనె 20న భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.